దుబాయ్ పోలీసులు ఉపయోగించే పవర్‌ఫుల్ కార్లు

ఆయిల్ రిచ్ కంట్రీగా పేరొందిన దుబాయ్‌లో డబ్బుకు కొదవే ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ ధనవంతులు మాత్రమే అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తుంటారని మనకు తెలుసు. కానీ ప్రజలకు సేవలందించే పోలీసులు కూడా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తుంటారని ఎప్పుడైనా విన్నారా..? మరి ఆ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..! దుబాయ్ పోలీసులకు దూకుడు ఎక్కువ కాబోలు అందుకే వారికి అత్యంత శక్తివంతమైన కార్లను అక్కడి ప్రభుత్వం మంజూరు చేసింది.

దుబాయ్‌లో నేరగాళ్లను వేగంగా పట్టుకునేందుకు కోసం అక్కడి పోలీసులకు కూడా వేగంగా పరుగులు పెట్టే కార్లను దుబాయ్ సర్కార్ ఆఫర్ చేస్తుంది. వేగం అంటే మామూలు వేగం కాదండోయ్, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే లాంబోర్గినీ కార్లను దుబాయ్ పోలీసులు ఉపయోగిస్తున్నారంటే, ఇక దొంగలు ఎక్కడికి పారిపోతారు చెప్పండి..? దుబాయ్ పోలీసులు వారు ఉపయోగించే కార్ల గురించి ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

దుబాయ్ పోలీసులు ఉపయోగించే పవర్‌ఫుల్ కార్లు

దుబాయ్ పోలీసులు ఉపయోగించే పవర్‌ఫుల్ కార్లు

దుబాయ్ పోలీసులు వారు ఉపయోగించే కార్ల గురించి ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్

సాధారణంగా బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఒక ఎగ్జిక్యూటివ్ కారు. సంపన్న వర్గాలకు చెందిన ప్రజలు మాత్రమే ఈ కారును ఉపయోగిస్తుంటారు. అయితే, దుబాయ్ పోలీసులకు మాత్రం ఈ కారు మన దేశంలో అధికారులకు మంజూరు చేసే అంబాసిడర్ కారు లాంటిదని చెప్పవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

కేవలం బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారునే కాదు మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ లగ్జరీ కారును కూడా దుబాయ్ పోలీసు అధికారులకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది.

చెవర్లే కమారో

చెవర్లే కమారో

అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలిగిన ఈ చెవర్లే కారులో దుబాయ్ పోలీసులు దొంగలను చేజ్ చేస్తుంటే ఒక్కసారి ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.

టొయోటా ప్రాడో

టొయోటా ప్రాడో

మన దేశంలో అత్యంత అరుదుగా కనిపించే ఈ టొయోటా ప్రాడో లగ్జరీ ఎస్‌యూవీని దుబాయ్ పోలీసులు తమ అధికారిక వాహనంగా ఉపయోగిస్తుంటారు.

టొయోటా ఫార్చ్యూనర్

టొయోటా ఫార్చ్యూనర్

టొయోటా ప్రాడో మాదిరిగానే టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా తక్కుల క్యాడర్ కలిగిన దుబాయ్ పోలీసులు తమ అధికారిక వెహికల్‌గా పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.

హమ్మర్ హెచ్1

హమ్మర్ హెచ్1

ఈ భీకరమైన ఎస్‌యూవీని చూసిన ఏ ఆందోళనకారుల సమూహమైన అవాక్కయితీరాల్సిందే.

లాంబోర్గినీ అవెంటేడర్

లాంబోర్గినీ అవెంటేడర్

జమ్ అని వాయు వేగంతో దూసుకువెళ్లే ఈ కారులో దొంగలను తరుముతుంటే, వారు ఎంత దూరం పారిపోగలరు చెప్పండి.

ఫెరారీ ఎఫ్ఎఫ్

ఫెరారీ ఎఫ్ఎఫ్

అవెంటేడర్ మాదిరిగానే ఫెరారీ ఎఫ్ఎఫ్ సూపర్ కారును కూడా పోలీసు ఉన్నతాధికారులకు కేటాయిస్తారు.

దుబాయ్ పోలీసులు ఉపయోగించే పవర్‌ఫుల్ కార్లు

దుబాయ్ పోలీసులు ఉపయోగించే పవర్‌ఫుల్ కార్లు

అందుకే అంటారు తింటే గారెలే తినాలి, పుడితే దుబాయ్‌లో పోలీస్‌గానే పుట్టాలని.

More from DriveSpark

Article Published On: Thursday, April 25, 2013, 17:37 [IST]
English summary
Dubai Police could easily lay claim to the title of the world's coolest police department. While several police departments around the globe use sportscars as interceptors or patrol vehicles, the Dubai Police department's fleet of supercars puts to shame every other police car fleet.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+