సంతలో కూరగాయలు కొన్నంత ఈజీగా లగ్జరీ కార్లు కొనేస్తున్న దుబాయ్ షేక్.. వైరల్ అవుతున్న వీడియో..
బైక్ లేదా కారు కొనాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వాహనం పనితీరు ఎలా ఉంటుంది. మన బడ్జెట్‌లో వస్తుందా లేదా ఇలా చాలా లెక్కలు వేసుకుని అంతా సరిగానే ఉంది అనుకుంటేనే కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం సంతలో కూరగాయలు కొన్నంత సులభంగా కార్లు కొనేస్తున్నాడు.
డబ్బు గురించి ఆలోచించకుండా ఇలా విచ్చలవిడిగా కార్లు కొంటున్న ఆ రిచ్ కిడ్ ఎవరా అనే కదా మీ సందేహం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ మధ్య సోషల్ మీడియాలో కొత్త తరహా ఘటనలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఏ కొత్త విషయం జరిగినా అది నిమిషాల్లో ప్రపంచమంతా పాకిపోతుంది. ఫేమస్ అవ్వడం కోసం విచిత్రమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ షోరూమ్‌లో కోట్లలో డబ్బులు పెట్టి లగ్జరీ కార్లు కొంటున్నట్లుగా ఉన్న వీడియో వైరల్‌గా మారింది.
ఆ వీడియో చూసిన నెటిజన్లకు ఈ ధనవంతుడు ఎవరనే ప్రశ్న మెదిలింది. కానీ ఇటీవల ఈ ధనవంతుడిని దుబాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ధనవంతుడిని పోలీసులు అరెస్ట్ చేయడమేంటని అనుకుంటున్నారా.. అతడిని ఎందుకు అరెస్టు చేశారు? దీని వెనుక కారణం ఏమిటి? వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌లోని షేక్‌లందరూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వారిపై ప్రపంచమంతా ధనవంతులనే ముద్ర ఉంది. దుబాయ్‌లో అధిక సంఖ్యలో ధనవంతులు ఉన్నందున, మనం అలా భావించడంలో తప్పు లేదు. అయితే దుబాయ్‌లో తెల్లని వస్త్రాలు ధనికులకే కాదనే విషయం చాలా మందికి తెలియదు. అదే ఇక్కడ మనల్ని పొరపాటు పడేలా చేసింది.
వీడియోను పరిశీలిస్తే దుబాయ్‌లో తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అక్కడ ఓ కార్ షోరూమ్‌కి వెళ్లి తన సిబ్బందితో కలిసి పెద్ద డబ్బు పెట్టెను పట్టుకెళ్లాడు. అక్కడ కార్లు కొంటున్నట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిని లక్షల కొద్దీ నెటిజన్లు వీక్షించారు.
కార్ షోరూమ్‌కి అతని వెనుక కొందరు పెద్ద డబ్బు పెట్టె పట్టుకుని వచ్చారు. సూపర్ మార్కెట్‌లో వస్తువులు కొంటున్నట్లుగా ఖరీదైన కార్లన్నటినీ కొనుగోలు చేస్తున్నాడు. అలా ఈ కారు బుక్ చేయండి అంటూ, బాగా ఖరీదైన కార్లు ఏవి, స్పోర్ట్స్ కారు ఏవీ ఇక్కడ అంటూ సిబ్బందిని అడుగుతున్నాడు. వారు ఖరీదైన కార్లను చూపిస్తే ఇంకా ఎక్కువ ధరలో లేవా అని ప్రశ్నిస్తున్నాడు.
అలా కనిపించిన ప్రతి లగ్జరీ కారును చూసి ఈ కారు బుక్ చేయండి అంటూ ఆర్డర్ వేస్తున్నాడు. అంతే కాకుండా అందులో పనిచేస్తున్న సిబ్బందికి టీ, స్నాక్స్ తీసుకోండి అంటూ వారిపై డబ్బుల కట్టలు విసిరేస్తున్నాడు. చివర్లో చిల్లర ఉంచుకోండి అంటూ తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలా మంది షాకయ్యారు.
అంత డబ్బు ఉన్న వ్యక్తి ఇంత క్యాజువల్‌గా వచ్చి కార్లన్నీ ఎలా కొనుక్కుంటాడనే ఆలోచనలో పడ్డారు. ఎందుకు వీడియో తీసి షేర్ చేశాడో తెలియక ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను పలువురు షేర్ చేయగా, దుబాయ్‌లో షేక్‌ల మాదిరిగా జీవించాలనుకుంటున్నానని పలువురు కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటన ఇటీవల జరిగినట్లుగా సమచారం.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే దీని తర్వాత, ఇది నిజమైన వీడియో కాదని, ఫేక్ వీడియో అని తేలింది, దుబాయ్ షేక్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ వీడియోలోని వ్యక్తిని దుబాయ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీడియోలో అతడు దుబాయ్ సంప్రదాయ దుస్తులను ధరించి ఈ చర్యకు పాల్పడ్డాడు.
అతను ఇలా ప్రవర్తించడం ఎమిరాటీ అని పిలువబడే ఇస్లామిక్ సమూహానికి అవమానంగా పరిగణించబడుతుంది. దీంతో వీడియోపై ఫిర్యాదు అందింది. వీడియో తీసిన కార్ షోరూమ్ యజమానిని కూడా విచారణకు పిలిచారు. ఈ వీడియో తీసిన ఉద్దేశ్యాన్ని తెలుసుకోనున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications








