అదేదో బంగారు నెంబర్ ప్లేటో లేక వజ్రాలు పొదిగిన నెంబర్ ప్లేటో కాదు. కేవలం రెండు అంకెలు మాత్రమే ఉండే నెంబర్ ప్లేట్. మరి దీని ధర ఎంతో అక్షరాల 18 కోట్ల రూపాయలు. దుబాయ్‌లో జరిగిన ఓ వేలం పాటలో 'కే 50' (K50) అనే ఫ్యాన్సీ నెంబర్ రూ. 18 కోట్ల (408,391 అమెరికా డాలర్లు) వెల పలికింది. అదే ఈ నెంబర్‌కు వెచ్చించిన మొత్తంతో మన దేశంలో అయితే ఓ మంచి బ్రాండెడ్ ఫారిన్ కారును కొనుక్కోవచ్చు. దుబాయ్‌లో ఈ నెంబర్ చాలా అరుదుగా లభించేది కావడంతో దీన్ని సొంతం చేసుకునేందుకు 67 మంది పోటీపడ్డారు.
ఆ తర్వాత అధికంగా I 26 అనే నెంబర్ 3,50,000 అమెరికన్ డాలర్లకు మరియు G-36 అనే నెంబర్ 3,10,000 అమెరికన్ డాలర్లు పలికింది. ఈ నెంబర్ ప్లేట్ కోసం వచ్చిన బిడ్డింగ్‌లను చూసి రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాము ఇప్పటి వరకూ ఎన్నో నెంబర్లను వేలం వేశామని ఇంద భారీ స్పందన ఎప్పుడూ చూడలేదని అథారిటీ అంటోంది. తర్వాతి వేలం సెప్టెంబర్‌లో జరగనుంది.