ఖరీదైన ఫెరారీ 296 GTB కారులో దుల్కర్‌ సల్మాన్‌ చక్కర్లు.. ఈ కారు ధర ఇన్ని కోట్ల రూపాయలా.!!

నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు సినిమాలతో పాటు కార్లంటే కూడా చాలా ఇష్టం. అందుకే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినీ రంగంలో సక్సెస్‌ను అందుకోవడమే కాదు.. అధునాతన లగ్జరీ కార్లను సైతం తన గ్యారేజ్‌లో భద్రపరుచుకుంటున్నారు. ఇప్పటికై దుల్కర్‌ పలు లగ్జరీ కార్లలో బయట కనిపించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరో లగ్జరీ కారులో దుల్కర్‌ కెమెరాలకు చిక్కారు.

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. సీతారామం సినిమాతో అందరి హృదయాలను గెలుచుకున్నారు దుల్కర్‌ సల్మాన్(Dulquer Salmaan). తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. మమ్ముట్టి కొడుకు అయినప్పటికీ. తన ప్రతిభతో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు.

Dulquer-Salmaan-Ferrari-296-GTB

కాగా సినిమాలకు అతీతంగా దుల్కర్ సల్మాన్‌కి కార్లంటే చాలా ఇష్టం. అందుకు అతని ఖరీదైన కార్ల కలెక్షన్లే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే వివిధ కార్లను కలిగి ఉన్న దుల్కర్ సల్మాన్.. ఇటీవల కొత్త ఫెరారీ 296 GTBని కూడా కొనుగోలు చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ కారు ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇటీవల ఈ కారుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో మనం 2 ఖరీదైన కార్లను చూడవచ్చు. వీటిలో ఒకటి ఫెరారీ 296 GTB. ఈ కారును దుల్కర్ సల్మాన్ నడిపారు. మరొకటి Mercedes-Benz G63 AMG. ఇది కూడా దుల్కర్‌ సల్మాన్‌దే. కానీ ఈ కారును మరొకరు డ్రైవ్‌ చేశారు. ఈ 2 కార్లు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌కు వచ్చినప్పుడు వీడియో తీశారు.

Dulquer-Salmaan-Ferrari-296-GTB

ముందుగా Mercedes-Benz G63 AMG హోటల్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించింది. వెనుక దుల్కర్ సల్మాన్ నడుపుతున్న ఫెరారీ 296 GTB బయట వేచి ఉండటాన్ని వీడియో చూడవచ్చు. ఆ కాసేపటి తర్వాత దుల్కర్‌ కూడా ఫెరారీ కారులో లోపలికి వెళ్లాడు. కాగా దుల్కర్ సల్మాన్ కొత్తగా కొనుగోలు చేసిన ఫెరారీ 296 GTB కారు ధర 5.44 కోట్లు.

అయితే ఈ కారు ధర చూసి ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఆన్-రోడ్ ధర సుమారు రూ.6.25 కోట్లుగా ఉంది. దీన్ని బట్టే అర్థమవుతుంది. దుల్కర్‌ కార్లను ఎంతగా ఇష్టపడతాడనేది. రూ. 6.25 కోట్ల ఖరీదైన లగ్జరీ ఫెరారీ కారులో దుల్కర్‌ వస్తున్న వీడియోలు ఫ్యాన్స్‌ను అలరించాయి.

Dulquer-Salmaan-Ferrari-296-GTB

ఇక Ferrari 296 GTB కారు విషయానికొస్తే.. ఈ కారు 2.9 లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి ఎలక్ట్రిక్ మోటారు కూడా అమర్చారు. ఈ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ అద్భుతమైన పనితీరును కూడా అందిస్తుంది. ఈ కారు కేవలం 2.9 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

Dulquer-Salmaan-Ferrari-296-GTB

ఈ వీడియోలో మనం చూస్తున్న మరో ఖరీదైన కారు Mercedes-Benz G63 AMG. ఇది కూడా దుల్కర్‌ సల్మాన్‌కు చెందినదే. 2021లో దుల్కర్ సల్మాన్ ఈ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.44 కోట్లుగా ఉంది. కాగా చాలా కాలంగా దుల్కర్‌ ఫెరారీలో తిరుగుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నప్పటికీ.. వీడియోను చూడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ వీడియోను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, December 7, 2023, 18:05 [IST]
English summary
Dulquer salmaan spotted in ferrari 296 gtb worth rs 6 25 crore video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+