ఈఫిల్ టవర్ ముందు అల్ట్రావయోలెట్ F77 మీద దుల్కర్ సల్మాన్, కూతురు మర్యామ్.. సోషల్ మీడియా షేక్
మలయాళం యువ సూపర్ స్టార్ అయిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి కూడా సుపరిచితుడిగా మారిపోయాడు. టాలీవుడ్‌లో హాట్రిక్ హిట్స్ కొట్టిన దుల్కర్‌కి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ ప్రశంస దక్కింది.
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ దుల్కర్ తన వాహనాలపై ప్రేమను ఏమాత్రం తగ్గించుకోడు. ఆయన పెట్టుబడి పెట్టిన అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ, ఫాదర్స్ డే సందర్భంగా దుల్కర్, తన కూతురు మర్యామ్లతో కలిసి తమ ఎలక్ట్రిక్ బైక్‌పై కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది.

అల్ట్రావయోలెట్ కంపెనీ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో వచ్చిన ఈ ఫోటో తెగ వైరల్ అయింది. ఇటీవల అల్ట్రావయోలెట్ కంపెనీ 10 యూరోపియన్ దేశాల్లో తమ బైకులను లాంచ్ చేసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు యూవీ బైక్ ఓనర్లు అల్ట్రావయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌తో పోజులిచ్చిన ఫోటోలతో పాటు, మరో ఫోటో కూడా ఇంటర్నెట్‌ని షేక్ చేసింది.
అదేంటంటే, చిన్నారి మర్యామ్‌తో పాటు దుల్కర్, కంపెనీ ఓనర్లు ఈఫిల్ టవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడిన ఫోటో. dq_cars_369 అనే ఫ్యాన్ పేజీలో ఈ ఫోటో కనిపించింది. దుల్కర్ సల్మాన్ కంపెనీ ఓనర్లతో కలిసి నిలబడి ఉండగా, కూతురు మర్యామ్ బైక్‌పై కూర్చుని ఉంది. ఈ ఫోటోకి కామెంట్ల బాక్సులో ఫ్యాన్స్ తమ ప్రేమకు కామెంట్ల రూపంలో కురిపించారు.

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్, జర్మనీలో విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత తమ టాప్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లైన F77 మ్యాక్ 2, F77 సూపర్ స్ట్రీట్లను ఫ్రాన్స్‌లో విడుదల చేసింది. పారిస్‌లో ఈ లాంచ్ జరిగింది. 2025 జూలై 31 వరకు చేసే అన్ని ప్రీ-బుకింగ్‌లకు రెండు మోటార్‌సైకిళ్లను ప్రత్యేక ధరలో అందిస్తామని కంపెనీ ఫ్రాన్స్‌లోని కస్టమర్లకు తెలిపింది.
రూ.8,99,100(సుమారు 9990 యూరోలు)కు విక్రయించే F77 మ్యాక్ 2 మోటార్‌సైకిల్‌ను ప్రత్యేక ఆఫర్ కింద రూ.8,09,100(సుమారు 8990 యూరోలు)కే పొందే అవకాశం ఉంది. F77 సూపర్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ సాధారణ ధర రూ.8,36,100 (సుమారు 9290 యూరోలు)కే లభిస్తుంది.
F77 మోటార్‌సైకిళ్లు కేవలం 2.8 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. 10.3 kWh బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా 30 kW పవర్, 100 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది వేగవంతమైన యాక్సిలరేషన్, మంచి హ్యాండ్లింగ్‌ను అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 155 కిలోమీటర్లు. బోష్ అభివృద్ధి చేసిన వయోలెట్ ఏఐ, స్విచ్చబుల్ డ్యూయల్-ఛానెల్ ఏబీఎస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో ఉన్నాయి. 10-స్టెప్ రీజనరేటివ్ బ్రేకింగ్, 4-స్టెప్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు సెఫ్టీ, పర్ఫామెన్స్ మెరుగుపరిచి, సేఫ్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయని కంపెనీ తెలిపింది.
అగ్రెసివ్ డిజైన్‌తో కూడిన మరింత డైనమిక్ రైడ్ ఎక్స్పీరియన్స్ F77 మ్యాక్ 2 అందిస్తుంది. సూపర్ స్ట్రీట్‌కు స్ట్రెయిట్‌గా కూర్చునే పొజిషన్, మెరుగుపరచబడిన ఎర్గోనామిక్స్ ఉన్నాయి. మంచి ఇన్వెస్టర్ల నెట్‌వర్క్, భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నైపుణ్యం మద్దతుతో ఈవీ విభాగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారాలనే అల్ట్రావయోలెట్ కోరికను ఇది బలపరుస్తుంది. దుల్కర్ లాంటి ఇన్వెస్టర్ల పూర్తి మద్దతు కూడా కంపెనీకి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: దుల్కర్ సల్మాన్ తన సొంత కంపెనీని ఇలా ప్రమోట్ చేయడం, అందులో తన కూతురితో కలిసి కనిపించడం నిజంగా ఆకట్టుకుంటుంది. ఇది అల్ట్రావయోలెట్ బ్రాండ్‌కు చాలా మంచి పబ్లిసిటీ. ఎలక్ట్రిక్ బైకుల మార్కెట్ పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి లేటెస్ట్ ఫీచర్లతో కూడిన బైకులు అంతర్జాతీయంగా విజయం సాధించడం ఖాయం.


Click it and Unblock the Notifications








