గాలిలోకి రయ్యిన ఎగిరే సైకిల్ (ఫొటోలు, వీడియో)
అదేదో ఇంగ్లీష్ సినిమాలో ఎగిరే సైకిళ్లు ఉంటాయి. అది సినిమా కాబట్టి, గ్రాఫిక్స్ మాయాజాలంతో దేన్నయినా ఎగిరించవచ్చు. కానీ నిజజీవితంలో ఎగిరే సైకిళ్లను మీరెప్పుడైనా చూశారా..? అలాంటి ఓ ఎగిరే సైకిల్ గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి.
మినిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి నిరూపించారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఎగిరే సైకిల్‌ను రూపొందించారు. అంతేకాదు, దీనిని విజయవంతంగా ఎగిరించి మీడియాకు కూడా ప్రదర్శించారు. (చివరి స్లైడ్‌లో వీడియాలో వీక్షించవచ్చు).
ఈ సైకిల్‌లు ముందు వెనుక రెండు పెద్ద బ్లేడ్స్ (ఫ్యాన్ రెక్కలు)తో పాటు మరో నాలుగు బ్లేడ్స్ అంటే మొత్తం ఆరు బ్లేడ్స్ ఉపయోగించారు. ఈ బ్లేడ్స్ ప్రొపెల్లర్ల ద్వారా తిరుగుతాయి. ఈ ప్రొపెల్లర్లు, సైకిల్ ఫ్రేమ్‌కు మధ్యభాగంలో అమర్చిన బ్యాటరీ సాయంతో పనిచస్తాయి.
ఈ సైకిల్ మొత్తం బరువు 100 కిలోలు మాత్రమే. దీన్ని తయారు చేయటానికి అనేక వేల డాలర్లు ఖర్చందయిట. అది ఖచ్చితంగా ఎంత మొత్తం అనేది మాత్రంల తెలియరాలేదు. దీనిని రిమోట్ కంట్రోల్ సాయంతో నడపవచ్చు. సైకిల్ కూర్చున్న వ్యక్తే దీనిని యాంత్రికంగా ఉన్నచోటు నుండే టేకాఫ్/ల్యాండింగ్‌ను చేసుకునే వీలుంటుంది. మరి ఈ ఎగిరే సైకిల్‌ను మనం కూడా చూసొద్దామా..?








Click it and Unblock the Notifications








