E20 పెట్రోల్ గురించి విన్నారా... దీని వినియోగం వల్ల ఎంత నగదు ఆదాచేయవచ్చునో తెలుసా?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 ను ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఎక్స్‌పోలో (Bharat Mobility Global Expo 2024) అనేక ప్రముఖ వాహనాల తయారీ, బ్యాటరీ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కూడా హాజరై ప్రసంగించారు. ఈ ఎక్స్‌పోలో అనేక సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి.
ఈ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రధానంగా ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో (Flex Fuel) నడిచే వాహనాలను విడుదల చేశారు. మారుతి సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థలు మారుతి సుజుకి వ్యాగన్ఆర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌ను ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో విడుదల చేశారు. రానున్న కాలంలో ఈ ఇంధనంతో నడిచే మరిన్ని వాహనాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో అధికంగా పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలు ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. దీంతో ఈ ముడిచమురు కోసం ఎక్కువగా విదేశాలపై భారత్ ఆధారపడుతోంది. అయితే క్రమంగా పెట్రోల్ అవసరాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నయ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల పెట్రోల్ అవసరాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చని భావిస్తోంది. మరియు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
ఏంటీ ఫ్లెక్స్ ఫ్యూయల్ : పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్ లేదా మిథనాల్‌ను కలపడం ఈ ఇంధనాన్ని తయారు చేస్తారు. దీన్నే E20 అంటారు. ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ ను సహాజంగా ఉత్పత్తి చేస్తారు. పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ గతంలోనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని చేపట్టింది.

E20 అంటే 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ప్రస్తుతం దీన్ని గరిష్ఠ వినియోగానికి తీసుకురావాలని భావిస్తోంది. E20 ను E50 కి తీసుకురావాలని భావిస్తున్నారు. భారత్‌లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను తొలిసారి జియో బీపీ అనే సంస్థ విక్రయిస్తోంది. తన అన్ని పాయింట్లలో E20 పెట్రోల్‌ను విక్రయిస్తోంది.
అయితే E20 ఫ్యూయల్ కారణంగా గణనీయంగా నగదును ఆదా చేసుకోవచ్చు. జియో బీపీ తయారు చేసిన E20 ఇంధనంలో 80శాతం పెట్రోల్, 20శాతం ఇథనాల్ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96గా ఉంది. ఇందులో 80 శాతం పెట్రోల్ అంటే రూ.76.80గా ఉంటుంది. అలాగే లీటర్ ఇథనాల్ రూ.55గా ఉంది. ఇందులో 20 శాతం అంటే రూ.11గా ఉంది.
నగదు ఆదా: అంటే లీటర్ E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్ (రూ.76.80) + 20 శాతం (రూ.11) గా ఉంది. ఫలితంగా ఈ E20 ఫ్యూయల్ ధర రూ.87.80కి అందుబాటులోకి వస్తుంది. సాధారణ లీటర్ పెట్రోల్ కంటే రూ.8.20 తక్కువకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పెట్రోల్ వినియోగం కూాడా భారీగా తగ్గుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








