Car Driving కారు డ్రైవింగ్ నేర్చుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ABCD టిప్..చాలా ఉపయోగకరం

కారు డ్రైవింగ్ అనేది ఓ కళ. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కారు డ్రైవింగ్ అనేది కచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ద్విచక్ర వాహనాలతో సమానంగా నేడు మార్కెట్లో కార్లు కూడా అంతే మొత్తంలో దర్శనమిస్తున్నాయి. కారు డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద విద్య ఏమి కాదు.

కారు డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రస్తుత కాలానికి చాలా అవసరం. ఎందుకంటే కార్లు ఇప్పుడు చాలా మంది జీవితాల్లో భాగంగా మారాయి.18 ఏళ్లు పైబడిన వారు కారు నడపడం నేర్చుకోకపోతే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కచ్చితంగా నేర్చుకోవాలి. అయితే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు పాటించవలసిన జాగ్రత్తలు మీకోసం అందిస్తున్నాం.

car driving

కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కొన్ని ప్రాథమిక విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారు డ్రైవింగ్ లో అనేక ప్రాథమిక అంశాలు ఉన్నప్పటికీ A, B, C, D అనే నియమాలు చాలా కీలకం. ఈ నాలుగు ఫంక్షన్లను సరిగ్గా చేయగలిగితే కారు మీ పర్యవేక్షణలో ఉన్నట్లే. వీటికి సంబంధించిన విషయాల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం.

కారు నడపడం అనేది చాలా సులువు. ABCD అనే కోడ్ లు ఉపయోగించి డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఇందులో A అంటే - యాక్సిలరేటర్ పాడిల్, B అంటే - బ్రేక్ పాడిల్, C అంటే - క్లచ్ పాడిల్, D అంటే - డెడ్ పాడిల్ గా గుర్తుంచుకోవాలి. ఈ కోడ్ లు డ్రైవింగ్ ను త్వరగా నేర్చుకునేందుకు సహకరిస్తాయి.

car driving tips

ఎ, బి, సి అనేవి చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ డి (డెడ్ పాడిల్) చాలా తక్కువ మందికి తెలుసు. దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం. అసలు డెడ్ పెడల్ అంటే ఏమిటి.. దాని పని ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేయనున్నాం. 'డెడ్ పెడల్' పేరులో ఉన్నట్లుగా నిశ్చలంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసే సమయంలో మీ ఎడమ పాదానికి విశ్రాంతి తీసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు.

వాస్తవానికి లాంగ్ డ్రైవ్ లో ఎడమ కాలు ఎక్కువగా ఉపయోగించరు. కాకపోతే రద్దీ ప్రదేశాల్లో ఎడమ పాదంతో పదే పదే క్లచ్ ను తొక్కడం చేస్తాము. ఎడమ కాలు పూర్తిగా క్లచ్‌ను నొక్కడానికి విడుదల చేయడానికి ఉపయోగించబడుతుంది. దీంతో ఈ కాలుపై అధిక భారం పడుతుంది. ఎడమ కాలుకి ఎక్కువగా విశ్రాంతినిచ్చేందుకు డెడ్ పెడల్ ను ఉపయోగించవచ్చు.

car driving

A, B, C పని?: కారును వేగవంతం చేయడానికి యాక్సిలరేటర్ పెడల్ ఉంటుంది. కారును ఆపడానికి బ్రేక్ పెడల్ ఉపయోగించాలి. ఈ రెండింటి కోసం కుడి పాదం మాత్రమే ఉపయోగించబడుతుంది. అదే సమయంలో, క్లచ్ పెడల్ గేర్ ను మార్చడానికి ఎడమ కాలు ఉపయోగించబడుతుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇవి ఖచ్చితంగా తెలుసుకోవలసిన కీలక అంశాలు కావున వీటిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.

కారుపై పూర్తి పట్టు ఉండేందుకు సరైన సమయంలో గేర్లను ఉపయోగించడం కీలకంగా ఉంటుంది. కారు మూవ్ మెంట్ ను బట్టి సకాలంలో గేర్లు మార్చాలి. గేరు, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అనేవి చాలా కీలకం. వీటిపై పట్టు సాధిస్తే కారును అలోవకగా నేర్చుకోవచ్చు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారు నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవడం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Tuesday, May 9, 2023, 12:52 [IST]
English summary
Easy to learn car driving using abcd tips details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+