సరికొత్త డ్రోన్: ఫైలట్ లైసెన్స్ అవసరం లేకుండా స్వతహాగా నడుపుతూ ప్రయాణించవచ్చు...!!

By Anil

లాస్ వేగాస్‌ లో 2016 సీఇఎస్ షో వివిధ రకాల నూతన ఆవిష్కరణలకు నిలయమైంది. ఇక్కడ వివిధ రకాల ఎలక్ట్రిక్ కార్లు మరియు చిన్నపాటి డ్రోన్‌లను పరిచయం చేస్తున్నారు. అందులోని ఒక ఆవిష్కరణే ఈ హెలికాప్టర్ డ్రోన్. హెలికాప్టర్‌కు తక్కువ డ్రోన్‌కు ఎక్కువ అందుకే దీనిని ఇలా హెలికాప్టర్ డ్రోన్ అని పిలవాల్సి వచ్చింది.

ఈ డ్రోన్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం నుండి తెలుసుకుందాం రండి.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

గత వారం రోజుల నుండి జరుగుతున్న ఈ సీఇఎస్ షో లో చాలా వరకు డ్రోన్‌లు పరిచయం అయ్యాయి. కాని అన్నింటిలో కన్నా ఇది ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా మనుషులను మోసుకెళ్లే పైలట్ లెస్ డ్రోన్ కావడం వలన.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

కేవలం ఒక్కరిని మాత్రమే మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్ ‌ను చెైనాకు చెందిన సంస్థ తయారు చేసింది. దీనికి ఇహాంగ్ 184 అటానమస్ ఏరియల్ వెహికల్ అని పేరు కూడా పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీని మొత్తం బరువు 200 కిలోలు మరియు ఇది 120 కిలోలు వరకు బరువును మోయగలదు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీని అత్యధిక వేగం గంటకు 100 కిలో మీటర్లు. మరియు ఈ హెలికాఫ్టర్ డ్రోన్ దాదాపుగా 3,499 మీటర్ల గరిష్ట ఎత్తు వరకు ఇది ఎగరగలదు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

ఇందులో మనిషి కూర్చోవడానికి సురక్షితమైన కార్భన్ మరియు ఎకోక్సి పదర్థాలతో తయారు చేసిన ఫ్రేమ్ కలదు. ఇందులో కూర్చుని 12-అంగుళాల డిస్ల్పే మీద గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించుకుని కావాల్సిన ప్రదేశాలకు ఎంచక్కా చేరుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

ఈ డ్రోన్‌కు ఏవైనా అవాంతరాలు ఎదురైతే తనంతట తానే ప్రక్కకు తప్పుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇందులో దీని కోసం ప్రత్యేకంగా ఒక ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

అయినప్పటికి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎదురైతే దీనిని ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కంట్రలో సెంటర్‌ని కూడా ఏర్పాటు చేసారు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీనిని సురక్షితంగా క్షణంలో అయినా ల్యాండ్ చేయవచ్చు. అయితే ఇది ఏలా ఎగురుతుందని అనేగా మీ డౌట్. ఇందులో 142 హార్స్ పవర్ సామర్థ్యం గల ఎనిమిది ఎలక్ట్రిక్ మోటార్లు కలవు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

ఇందులో కూడా కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ కు కాంతులు వెదజల్లే లైట్లు, 4జి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు పొడవాటి డోర్లు కలవు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీనిని మీరు ఇంట్లో కూర్చునే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే విధంగా ఆపరేట్ చేయవచ్చు. అందుకే కాబోలు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇలాంటి డ్రోన్‌ను తమ వస్తువుల డెలివరీకి ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

అయితే దీనికున్న బ్యాటరీ సామర్థ్యం ప్రకారం ఇది గరిష్ఠంగా 23 నిమిషాల పాటు మాత్రమే గాలిలో ఎగరగలదని సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీని ధర దాదాపుగా రెండు లక్షల పౌండ్ల వరకు ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

దీనిని తయారు చేసిన సంస్థ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అథారిటీస్ నుండి గుర్తింపు పొందే ప్రయత్నంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా మనుషులను మోసుకెళ్లె హెలికాప్టర్ డ్రోన్

ఈ హెలికాప్టర్ డ్రోన్‌ను ఇంకా పూర్తిగా అభివృద్ది చేసి ఆ తరువాత వినియోగదారుల అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేస్తే బాగుటుంది.

మరిన్ని కథనాలు
  1. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయంకరమైన, ఎత్తైన వంతెన
  2. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన విమానాలు
  3. గూఢచారులను వెతికి పట్టే ప్రత్యేక డ్రోన్‌లు, వాటి వెనుకున్న ఆసక్తికరమైన విశయాలు. ఇక్కడ క్లిక్ చేయండి

More from DriveSpark

Article Published On: Friday, January 8, 2016, 16:07 [IST]
English summary
Ehang's 184 code named, Autonomous Aerial Vehicle is designed to carry a single human passenger, autonomously flying them from one location to another location.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+