రోడ్డుపై వెళ్తుండగా రెండుగా చీలిపోయిన బైక్.. భయపెడుతున్న వీడియో..!!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు తగినట్లుగా అధునాతన ఫీచర్లను ప్రవేశపెడుతూ మార్కెట్లో పోటాపోటీగా కొత్త ఈవీలు వస్తున్నాయి. అయితే నాసిరకమైన ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ప్రమాదమే అందుకు ఉదాహరణ.

తాజాగా ఓ ఎలక్ట్రిక్ బైక్ రన్నింగ్‌లో ఉండగానే రెండుగా చీలిపోయింది. దానిపై ప్రయాణిస్తున్న యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిన ఘటనలు ఇటీవల కాలంలో చాలా చూశాం. కాగా తాజా ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల క్వాలిటీపై ‌అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Biker-Falls-e-Motorcycle-Splits

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ బైక్ రోడ్డుపై వెళ్తుండగా రన్నింగ్‌లో ఉండగానే రెండుగా చీలిపోయింది. హ్యాండిల్ ఒక భాగం, సీటు వెనుక మరో భాగం రెండుగా విడిపోయాయి. బైక్‌పై ఉన్న యువకుడు ఒక్కసారిగా కిందపడిపోగా.. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. పెట్రోల్ అవసరం లేని ఈ- ఎలక్ట్రిక్ బైక్‌తో డబ్బు ఆదా అవుతుందని భావించాడు. ఇటీవల రోడ్డుపై వెళ్తుండగా మార్గం మధ్యలోకి వెళ్లగానే ఓ చోట బ్రేక్ వేశాడు. అంతే హ్యాండిల్‌ను బైక్‌తో కలిపే ఫోర్క్ విరిగిపోయింది.

Biker-Falls-e-Motorcycle-Splits

నడిరోడ్డుపై బైక్ రెండు ముక్కలు కావడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు.. ఎగిరి కింద పడ్డాడు. ఆ వెనకాలే ఓ వాహనం రాగా.. దాని కిందకు దాదాపుగా యువకుడి కాళ్లు వెళ్లిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అతడు కాళ్లు ముడుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకొని పైకి లేచాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బండి రెండు ముక్కలైపోవటమేంటని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్ , స్కూటర్స్ వినియోగాం జోరుగా సాగుతోంది. ఈ మధ్య విపరీతంగా పెట్రోల్ రేట్లు పెరగడంతో చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాల మీద పడ్డారు. దీంతో వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇలాాంటి ఘటనల తర్వాత కొన్నాక మాత్రం బాధపడాల్సి వస్తోంది.

అయితే ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అనుకోని పరిణామంతో షాక్‌కు గురయ్యారు. అయితే రెండు ముక్కలైన బైక్ ఏ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ బైక్ సరిగా లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్ సమయంలో కొన్నిసార్లు వెల్డింగ్ వంటి పనుల్లో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి లోపాలతో తయారైన వాహనాన్ని నిరంతరం నడిపినప్పుడు, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి.

తయారీ లోపాలు ఒక కారణం అయినప్పటికీ, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అలాంటి సంఘటనలను నివారించవచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు మీ వాహనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. వాహనంలో ఏవైనా సమస్యలు ఉంటే దీని ద్వారా మీకు తెలుసుకోవచ్చు. తద్వారా జాగ్రత్తగా ఉండవచ్చు.

అలాగే వాహనానికి ఎక్కువ ఒత్తిడి ఇవ్వకండి. స్పీడ్ బంప్స్ వద్ద లోడ్ చేస్తున్నప్పుడు, నెమ్మదిగా ప్రయాణించడం అవసరం. అలాగే వాహనాలను ఎక్కువగా ఓవర్‌లోడ్ చేయకండి. దీని ద్వారా మీ వాహనం యొక్క మైలేజ్ మరియు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.

ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్‌లో రెండుగా విరిగిపోయిన ఘటనలు గతంలో భారత్‌లో చోటుచేసుకోవడం గమనార్హం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆటోమొబైల్ తయారీదారులు నిబద్ధతతో వ్యవహరించాలి. అంతకు మించి తప్పు జరిగితే సంబంధిత సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, August 14, 2023, 16:27 [IST]
English summary
Electric bike splits in half while riding in mancherial video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+