త్వరలోనే ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవే.. పైలట్‌ ప్రాజెక్టుగా ఆ రెండు రాజధానులు, కేవలం 2 గంటలే జర్నీ.!!

పర్యావరణ పరిరక్షణ దిశగా భారత ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకు తగినట్లుగా ఈవీల పరిశ్రమకు ప్రోత్సహకాలు సైతం అందిస్తోంది. ఆటో పరిశ్రమలు సైతం వినూత్న డిజైన్లు, అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్‌ కార్లు, టూ వీలర్లను ప్రవేశపెడుతున్నాయి.

ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. త్వరలోనే దేశంలో ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవేల(Electric Cable Highway)ను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవేల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా.. గమ్యస్థానాల ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. దీని ద్వారా వాహనదారులకు కూడా ఫ్యూయెల్‌ వాడకం కూడా తగ్గుతుంది. తద్వారా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.

Electric-Cable-Highway

ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు(Electric Vehicles) లబ్ధి చేకూరనుంది. దేశంలో ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవేను పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీ- జైపూర్‌ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యామని తెలిపారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు వెల్లడించారు.

ఢిల్లీ- జైపూర్‌ మార్గంలో నిర్మించనున్న ఎలక్ట్రిక్ కేబుల్ ద్వారా హైవేపై వెళ్తున్న వాహనాలకు విద్యుత్ శక్తిని అందిస్తుందని గడ్కరీ చెప్పారు. తద్వారా వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవే ద్వారా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం కూడా 30 శాతం ఆదా అవుతుందని గడ్కరీ వెల్లడించారు.

Electric-Cable-Highway

'ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవే ద్వారా ద్వారా ఢిల్లీ నుంచి జైపూర్‌కు కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని.. కాగా ఢిల్లీ నుంచి మీరట్‌కు ప్రయాణ సమయం 45 నిమిషాలు పడుతుందని గడ్కరీ అన్నారు. ఈ హైవే ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే జైపూర్ వాసులు ఐస్ క్రీం తినడానికి ఢిల్లీకి, ఢిల్లీవాసులు కచోరీ తినడానికి జైపూర్‌కు కేవలం రెండు గంటల్లోనే వెళ్లొచ్చని చమత్కరించారు.

అయితే ఈ ఎలక్ట్రిక్ కేబుల్ హైవేలు ఎలా పనిచేస్తాయో తెలుసా.. ఈ ప్రాజెక్టులో ఓవర్ హెడ్ పవర్ లైన్ల ద్వారా హైవేలపై వెళ్లే ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్ శక్తిని సరఫరా అవుతుంది. దీంతో ఈవీల బ్యాటరీకి అదనపు శక్తి(Extra Energy) లభిస్తుంది. అప్పుడు బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా వాహనాలు వేగంగా, త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి.

Electric-Cable-Highway

ఇందుకోసం హైవేలపై ఇరువైపులా రివర్స్ 'L' ఆకారంలో కరెంట్ పోల్స్‌ ఏర్పాటు చేస్తారు. వాటికి విద్యుత్ వైర్లను అమర్చడం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ కేబుల్‌ హైవే టెక్నాలజీ 2019 లోనే జర్మనీలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు చాలా దేశాల్లోనూ ఎలక్ట్రిక్ హైవేలు నిర్మిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Electric-Cable-Highway

More from DriveSpark

Article Published On: Monday, November 20, 2023, 12:15 [IST]
English summary
Electric cable highway between delhi and jaipur soon journey takes only 2 hours
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+