చలికాలంలో ఈ పొరపాట్లు చేస్తే బ్యాటరీ లైఫ్ ఖతం.. దాని లైఫ్ ఇంకా ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలంటే ?

చలికాలం అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక పెద్ద సవాలును తీసుకొస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు, ఈవీ బ్యాటరీల పనితీరుపై ప్రభావం చూపడం సహజం. ఈ సమయంలో సరైన అవగాహన లేని డ్రైవర్లు చేసే కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల బ్యాటరీ సామర్థ్యం, లైఫ్ స్పాన్ రెండూ తగ్గుతాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నట్లయితే, చలికాలంలో ఛార్జింగ్ సమయంలో కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఛార్జింగ్ అలవాట్లు దీర్ఘకాలంలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

చల్లని బ్యాటరీని వెంటనే ఛార్జ్ చేయకూడదు
ఎముకలు కొరికే చలిలో బ్యాటరీ ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వెంటనే ఫాస్ట్ ఛార్జింగ్ ప్రారంభించినట్లయితే బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గే అవకాశం ఉంది. దీనికి సరైన పద్ధతి ఏమిటంటే కారును కొద్దిసేపు స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టే ముందు బ్యాటరీని ప్రీ-హీట్ మోడ్‌లోకి తీసుకువెళ్లడం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుని, ఛార్జింగ్ ప్రక్రియ సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుంది.

Electric Car Charging Mistakes to Avoid in Winter Preserve Your EV Battery Life with These Essential Tips

ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఎక్కువగా వాడకండి
చలికాలంలో బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుందనే కారణంతో చాలా మంది డ్రైవర్లు ఫాస్ట్ ఛార్జర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఈ అలవాటు బ్యాటరీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చలిలో బ్యాటరీ కణాలు సమర్థవంతంగా ఛార్జ్ కాలేకపోవడం వల్ల, వేగంగా ఛార్జ్ చేసినప్పుడు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. అందుకే, అత్యవసరమైతే తప్ప ఫాస్ట్ ఛార్జింగ్‌ను వాడకుండా, వీలైనంత వరకు సాధారణ ఏసీ ఛార్జర్‎ను ఉపయోగించడం ఉత్తమం.

రాత్రంతా 100% ఛార్జ్‌లో ఉంచడం ప్రమాదకరం
సాధారణంగానే ఈవీ బ్యాటరీలను ఎక్కువ సమయం పూర్తి ఛార్జ్ (100% ఫుల్ ఛార్జ్) స్థితిలో ఉంచడం వాటి జీవితకాలాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చాలా కంపెనీలు కూడా తమ బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ కాలం కాపాడుకోవడానికి, బ్యాటరీని 80% నుంచి 90% మధ్య మాత్రమే ఛార్జ్ చేయాలని సలహా ఇస్తాయి. రాత్రంతా ఫుల్ ఛార్జ్ చేసి ఉంచే అలవాటును పూర్తిగా మానుకోవాలి.

Electric Car Charging Mistakes to Avoid in Winter Preserve Your EV Battery Life with These Essential Tips

తక్కువ ఛార్జ్‌తో కారు పార్కింగ్ చేయవద్దు
చలికాలంలో చాలా మంది తక్కువ బ్యాటరీ లెవెల్ ఉన్నప్పుడు కారును పార్క్ చేస్తారు, ఇది మరో పెద్ద పొరపాటు. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ మరింత వేగంగా డిశ్చార్జ్ అవుతుంది. బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ (SOC - State of Charge) చాలా తక్కువ స్థాయికి (0%కు) చేరుకుంటే, అది బ్యాటరీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి రాత్రిపూట కారును పార్క్ చేసేటప్పుడు ఎప్పుడూ 40% నుంచి 60% మధ్య ఛార్జ్ లెవెల్‌లో ఉంచడం ఉత్తమ పద్ధతి.

ఛార్జింగ్ సమయంలో హీటింగ్ సిస్టమ్‌ను ఆన్ చేయకూడదు
కారు ఛార్జింగ్ అవుతున్న సమయంలో కేబిన్ హీటర్‌ను (Cabin Heater) ఉపయోగించడం వల్ల బ్యాటరీపై అదనపు భారం పడుతుంది. ఇది ఛార్జింగ్ వేగాన్ని తగ్గించడమే కాకుండా, బ్యాటరీ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసేలా చేస్తుంది. అందువల్ల, డ్రైవర్లు ఛార్జింగ్ పెట్టే ముందు కేబిన్‌ను ప్రీ-హీట్ చేసుకోవడం మంచిది. ఛార్జింగ్ సమయంలో హీటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించకపోవడం ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, December 4, 2025, 11:41 [IST]
English summary
Electric car charging mistakes to avoid in winter preserve your ev battery life with these essential
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+