ఆరు నెలల్లో భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్ల ధర.. మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. అవి పర్యావరణ హితం కావడం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా వాటిని కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను పరిచయం చేస్తున్నాయి. సాంప్రదాయ వాహనాలతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

మన దేశంలో ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలం నడుస్తోంది. ఇదే క్రమంలో టెస్లా వంటి విదేశీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో దేశంలోకి ఎంట్రీ ఇస్తుండడంతో వాటి మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే సమయంలో మారుతి సుజుకి ఇండియా నుంచి హ్యుందాయ్ మోటార్ ఇండియా వరకు ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

Nitin Gadkari

టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్‎ను శాసిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ కార్ల ధరలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఆర్నెళ్లలో దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్ల ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని మంత్రి గడ్కరీ తెలిపారు. 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో మంత్రి ప్రసంగించారు.

ప్రస్తుతం పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఎలక్ట్రిక్ వాహనాలను నడపడానికి, మెయింటెనెన్స్‎కు అయ్యే ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ వాటి ముందస్తు ఖర్చు పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు కొందరు జంకుతున్నారు.

Nitin Gadkari On EV

"ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా ఉంటుంది.'' అని మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మన దేశంలో దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై కృషి చేస్తోందన్నారు. అందుకే పెట్రోలియం దిగుమతి బిల్లును తగ్గించడానికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇది కాకుండా, 212 కి.మీ పొడవైన ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం రాబోయే మూడు నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇది మాత్రమే కాకుండా, దేశం దిగుమతి బిల్లును తగ్గించడం అంటే ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న పని.. కాలుష్య రహితమైనది. స్వదేశీ ఉత్పత్తిని పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Nitin Gadkari s Announcement

భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల అవసరమని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో మంచి రోడ్లను నిర్మించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించవచ్చు. ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కూడా కృషి చేస్తుందన్నారు.

ఏదేమైనా దేశంలో మంచి నాణ్యమైన రోడ్లను నిర్మిస్తే అది సామాన్య ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కార్లు, ఇతర వాహనాల ఇంధన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పనిచేస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మంచి రోడ్లు నిర్మిస్తే వ్యాపారం, వాణిజ్యం కూడా పెరుగుతుందన్నారు.

Take a Poll

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2025, 11:45 [IST]
English summary
Electric car prices to drop significantly in six months nitin gadkari big announcement
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+