Maruti Suzuki Flying Cars భారత్‌కు ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్‌.. ఇంటిపైనే ల్యాండింగ్‌.!!

భారత్‌లో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన మాతృ సంస్థ 'సుజుకీ'(Suzuki Motors)తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు- ఎగిరే కార్ల(Flying Cars)ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఈ ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఈ మినీ ఎయిర్ కాప్టర్ల ద్వారా ట్రాఫిక్ రద్దీ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో ప్రజలను నిరంతరం వేధించే సమస్య ట్రాఫిక్‌.. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వాలు సైతం అనేక చర్యలు చేపడుతున్నాయి. అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్‌లు, మెట్రోలు ఇలా అనేక రకాలుగా రవాణా వ్యవస్థను విస్తరిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కులు తప్పడం లేదు.

Maruti-Suzuki-Flying-Cars

కానీ ఇంతటి ట్రాఫిక్‌ ఉన్న రోడ్లపై కొంచెం ఎత్తులో గాల్లో విహరిస్తూ వెళ్తుంటే ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. కిక్కిరిసిపోయే ట్రాఫిక్‌ను(Electrifying Flying Cars) దాటేస్తూ నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ కల తొందరలోనే నెరవేరనుంది. ఎందుకంటే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో ఎగిరే కార్లు.. చిన్న హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

సుజుకీ తయారు చేయనున్న ఈ ఎయిర్‌ కాప్టర్‌లు డ్రోన్‌(Drones)ల కంటే పెద్దవిగా.. హెలికాప్టర్లతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. ఈ ఎగిరే కార్లలో పైలట్ సహా ముగ్గురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన ట్రాఫిక్‌లో సైతం ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానానికి చేరుకునేందుకు ఇవి దోహదపడనున్నాయని సమాచారం.

Maruti-Suzuki-Flying-Cars

కాగా సుజుకి మొదటగా ఈ ఎగిరే కార్లను(Electric Aircopters) జపాన్ మరియు యుఎస్‌లలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత భవిష్యత్తులో భారత్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరితగతిన ఈ ఎగిరే కార్ల కార్యకలాపాలు అందుబాటులోకి వస్తే.. ప్రపంచ రవాణా వ్యవస్థలోనే ఇదో పెద్ద విప్లవం కానుంది.

ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో ఈ ఎయిర్‌ కాప్టర్లను ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి కూడా భారీగా ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎగిరే కార్లను స్థానికంగానే తయారు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీటిని తయారు చేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో కూడా చర్చలు జరుగుతున్నాయని సుజుకీ మోటార్ అధికారులు వెల్లడించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

Maruti-Suzuki-Flying-Cars

కాగా ఈ ఎగిరే కార్లకు SkyDrive అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్‌లను 2025 జపాన్‌లో జరిగే ఒసాకా ఎక్స్‌పోలో విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. భవిష్యత్తులో 'మేక్ ఇన్ ఇండియా' కింద ఈ స్కైడ్రైవ్‌లను భారత్‌కు పరిచయం చేయాలని మారుతీ సుజుకి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత్‌లో ఈ ఎగిరే కార్లకు మంచి స్పందన ఉంటుందా లేదా అనేది కూడా సంస్థ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

ఇక భారత్‌లో ఈ ఎగిరే కార్లకు మంచి డిమాండ్‌ ఉండాలంటే.. అవి సరసమైన ధరలో అందుబాటులో ఉండాలి. ఈ మేరకు సుజుకి మోటార్స్‌ కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలనలు చేస్తోంది. కాగా ఈ ఎయిర్ కాప్టర్ టేకాఫ్ సమయంలో 1.4 టన్నుల బరువు ఉంటుందట.

ఇది హెలికాప్టర్ బరువులో సగం కాగా.. బహుళ అంతస్థుల భవనం పైభాగంలో ఎయిర్ కాప్టర్లను ల్యాండ్‌ చేసే విధంగా వీటిని డిజైన్‌ చేస్తున్నారు. ఈ ఎయిర్ కాప్టర్ వాడకం భారతదేశంలోని పట్టణ నగరాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణె, ఢిల్లీ మరియు కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో మొదటి దశలో దీనిని ఉపయోగించే అవకాశం ఉంది.

Article Published On: Tuesday, February 13, 2024, 9:12 [IST]
English summary
Electric flying cars from maruti suzuki soon to check traffic problems check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+