ఛార్జింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ.. ఎందుకిలా జరుగుతున్నాయంటే.!!

దేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ఇందుకు కారణం. కస్టమర్లకు ఎలక్ట్రిక్‌ వాహనాలు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నా.. అప్పుడప్పుడూ కొన్ని ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు(Electric Scooter Battery Explodes) బ్యాటరీ ఛార్జ్‌ అవుతుండగా పేలిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi ) లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Electric Scooter) పేలిన ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సీఆర్‌ పార్క్ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుండగా పేలిపోయినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేదా మరణాలు సంభవించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.

Electric-Scooter-Battery-Explodes

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం గత మంగళవారం(సెప్టెంబర్‌ 19) రాత్రి 11.45 గంటల సమయంలో షాపు యజమాని ఎలక్ట్రిక్ స్కూటర్‌ బ్యాటరీ(Electric Scooter Battery)కి ఛార్జింగ్ పెడుతుండగా అది పేలిపోయింది. స్టోర్ లోపల ఉన్న అక్వేరియం దగ్గర స్కూటర్‌ని ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ పేలడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

దీంతో అతి పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న కోడల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఇలాంటి ఘటనలతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.

అసలు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో బ్యాటరీ ఎందుకు పేలుతుందంటే.. ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ ప్యాక్‌(EV Battery Pack )లో భారీ మొత్తంలో శక్తి నిల్వ ఉంటుంది. ఇది డ్యామేజ్‌ అయినట్లయితే థర్మల్ రన్‌అవే అనే ప్రమాదకరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ బ్యాటరీ అధిక వేడిని ఉత్పత్తి చేయడంతో ఫలితంగా బ్యాటరీ పేలి ప్రమాదం చోటుచేసుకుంటుంది.

వివిధ కారణాల వల్ల బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా, తయారీ లోపాలు, బ్యాటరీ పనిచేయకపోవడం, మరమ్మతులు సరిగా లేకపోవడం ద్వారా బ్యాటరీలు పేలవచ్చు. కాబట్టి, ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌(Electric Scooters)ను నీడలో పార్క్ చేసి ఛార్జ్ చేయాలని గుర్తుంచుకోవాలి.

బ్యాటరీని ఛార్జ్‌ చేసేటప్పుడు అందుకు అనుకూలంగా ఉండే బ్రాండెడ్‌ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ ఛార్జర్‌ని ఉపయోగించకూడదు. అలాగే, ఇంట్లో ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ ప్యాక్‌ను మండే పదార్థాలకు దూరంగా ఉంచాలి. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వేర్వేరు ఛార్జర్‌లను ఉపయోగించకూడదు.

మీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వేడిగా ఉన్నట్లయితే కాసేపు స్కూటర్‌(Electric Scooter Battery Safety Tips)ను తీసుకొని బయటికి వెళ్లండి. ఒక గంట పాటు బ్యాటరీలను ఛార్జ్ చేయకూడదు. కాసేపు దానిని చల్లారనివ్వండి. బ్యాటరీ పాడైపోయినా లేదా దానిలో నీరు లీక్ అయినట్లయి గమనిస్తే., వెంటనే మీ ఇ-స్కూటర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

లిథియం - అయాన్ బ్యాటరీ(Lithium Battery) వేడెక్కుతున్నట్లు మీరు గమనిస్తే.. దానిని సమీపంలోని మండే పదార్థాల నుండి దూరంగా తరలించాలి. అంతే కాకుండా విద్యుత్ సరఫరా కాకుండా స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడం లేదా పూర్తిగా ఛార్జ్ చేయడం చేయకూడదు. అందులో ఎనర్జీ ఎప్పుడూ.. 20 నుంచి 80 శాతం మధ్య ఉండేలా చూసుకోండి.

దూర ప్రయాణాల్లో మాత్రమే బ్యాటరీ(Battery Charge)ని పూర్తిగా ఛార్జ్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఢిల్లీలో జరిగిన బ్యాటరీ పేలుడు మాదిరిగానే గతంలోనూ పలు సమస్యల కారణంగా ఈ-స్కూటర్ బ్యాటరీలు పేలిపోయాయి. పైన పేర్కొన్న కొన్ని భద్రతా చర్యలను పాటించడం ద్వారా, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల బ్యాటరీ పేలుళ్లను నివారించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, September 21, 2023, 18:22 [IST]
English summary
Electric scooter battery explodes while charging in new delhi near cr park
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+