హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. టూ వీలర్స్‌కి ఫ్రీ..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహనాల సంస్థలు ఆకర్షించే ఫీచర్లు, రేంజ్ అందించే వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే అందుబాటులో ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ప్రజలు వీటిని కొనేందుకు మొగ్గు చూపడం లేదు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే అందుకు తగినట్లుగా ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం ఈ రంగాన్ని కుదేలు చేస్తుంది. అయితే చాలా చోట్ల పలు సంస్థలు వీటిపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యమైన టైర్-1, టైర్-2 నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తున్నాయి. పలు నగరాల్లో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది.

Lion charge EV charging stations in hyderabad

ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ సంస్థలతో పాటు కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలును ప్రోత్సాహిస్తున్నాయి. వీటితో పాటు ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పేందుకు సహకరిస్తోంది. ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగాన్ని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వాలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ నియమాల ప్రకారం రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

Lion charge EV charging stations in hyderabad

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగ గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా ఛార్జింగ్ స్టేషన్లు లేక ప్రజలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీనిలో భాగంగా జూబ్లిహిల్స్ లోని రోడ్-45లో ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులోకి వచ్చింది. లయర్ ఛార్జ్‌ సంస్థ వీటిని ఏర్పాటుచేసింది. ప్రస్తుతానికి ఫోర్‌ వీలర్స్‌ నుంచి మాత్రమే డబ్బులు వసూలు చేస్తోంది. టూవీలర్‌లకు ఉచితంగానే సర్వీసులు అందిస్తోంది.

సరసమైన ధరలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజరాహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాలకే పరిమితం కాకుండా నగరంలో ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే వీటి వినియోగం పెరుగుతుందని ఓ వినియోగదారుడు తెలిపారు. సాధారణంగా ఇంట్లో ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం పడుతుందని అదే ఛార్జింగ్ పాయింట్లలో చేయడం ద్వారా కాస్త త్వరగా ఛార్జ్ చేయవచ్చని వివరించారు.

Lion charge EV charging stations in hyderabad

ఈవీల వినియోగంపై అవగాహన కూడా కల్పించాలని మరో వినియోగదారుడు తెలిపారు. ఇంధన వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఉపయోగాలున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఈవీలదే భవిష్యత్తు కాబట్టి ఈవీలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈవీల ద్వారా నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుదని మరో వినియోగాదారుడు చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చింది. అందుకు తగినట్లుగా హైదరాబాద్ లో 300కు పైగా పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నిర్వహించనున్నారు.

బిజినెస్: దేశంలో ఈవీల సంఖ్య పెరుగుతోంది. అయితే వాటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు జరగటం లేదు. దీనిని ఓ మంచి వ్యాపార అవకాశంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. మంచి లాభం కోసం చూసేవారు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ప్రభుత్వ నియమాల ప్రకారం రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను అమర్చవచ్చు. అలాగే కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయవచ్చు. బస్సులు, ట్రక్కులు వంటి హెవీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కనీసం 100 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ పాయింట్లను స్థాపించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, June 29, 2023, 23:37 [IST]
English summary
Electric vehicle charging stations increasing in hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+