ఎలక్ట్రిక్ వాహనాలతోనూ కాలుష్యం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.!!
భారత మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehilces)కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ కాలుష్య కణాలను విడుదల చేస్తున్నాయని షాకింగ్ అధ్యయనం వెల్లడించింది.
గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకు పెద్ద సమస్యగా మారుతోంది. ఇది ప్రజా జీవనంపై కూడా ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వడం. కానీ ఈవీల ద్వారా కూడా పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోందని మీకు తెలుసా..

గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం పెట్రోల్ ఇంకా డీజిల్(EV'S Emits Pollution) ఇంజిన్ వాహనాల నుంచి వెలువడే కార్బన్-డయాక్సైడ్ ఉద్గారాలు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు అలాంటి పొగలను విడుదల చేయవని చెబుతూ ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు చిన్న స్టార్టప్‌లు.. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు చెందిన 'ఎమిషన్స్ అనలిటిక్స్' అనే పరిశోధన సంస్థ తన తాజా అధ్యయనం ద్వారా ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. 'ఎమిషన్స్ అనలిటిక్స్(Emission Analytics)' అన్ని రకాల ఉద్గారాలను శాస్త్రీయంగా లెక్కిస్తుంది. ఎమిషన్స్ అనలిటిక్స్ అనేది ఆటోమొబైల్స్ నుంచి వెలువడే ఉద్గారాల సంఖ్యను కొలుస్తుంది. కాగా కంపెనీ ఇటీవలే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

అయితే వాహనాల నుంచి ఎంత కార్బన్ కాలుష్యం వెలువడుతుందో తెలుసుకోవడానికి ఇది మామూలు పరీక్ష కాదు. వాహనాలు రోడ్డుపై కదులుతున్నప్పుడు ఎంత మేర కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయో తెలుసుకోవడానికి ఇది పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు 'వాల్ స్ట్రీట్ జర్నల్ op-ed' ( Wall Street Journal op-ed ) లో ప్రచురించబడ్డాయి.
వాహనాల కదలిక సమయంలో కారు భాగాల మధ్య ఘర్షణ వలన అణువులు సాధారణంగా చెదిరిపోతాయి. దీనినే 'పర్టిక్యులేట్ ఎమిషన్' అని పిలుస్తారు. అయితే ఇది కేవలం కారులో మాత్రమే కాకుండా ఏ వాహనంలోనైనా జరుగుతుంది. ఎమిషన్స్ అనలిటిక్స్ వాహనం యొక్క బ్రేక్‌లు మరియు టైర్ల నుండి విడుదలయ్యే అణువుల సంఖ్యను మాత్రమే కొలుస్తుంది. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఫలితం వెలువడింది.

అంటే, పెట్రోల్/డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ పర్టిక్యులేట్ పదార్థాన్ని విడుదల చేస్తున్నాయని ఉద్గార విశ్లేషణలో వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు మరియు టైర్ల నుంచి 1,850 రెట్లు ఎక్కువ కణాలను విడుదల చేస్తాయని పరిశోధనా సంస్థ నివేదించింది. ఎందుకంటే అవి ఎక్కువ బరువుతో నిర్మించబడ్డాయి.
పెద్ద బ్యాటరీల కారణంగా బరువుగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువెళ్లడానికి బలమైన టైర్లు అవసరమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో కైనటిక్ ఎనర్జీ మరియు టార్క్ సామర్థ్యం రెప్పపాటులో చక్రాలకు సరఫరా అవుతాయి. ఈ టైర్లను క్రూడ్ ఆయిల్‌తో తయారు చేసినందున, టైర్ అరిగిపోయినప్పుడు విషపూరిత రసాయనాలు విడుదలవుతాయని ఉద్గార విశ్లేషణలు కూడా చెబుతున్నాయి.

కాగా వాహనాల బ్రేకులు మరియు టైర్ల నుంచి చాలా కణాలు విడుదలవుతాయి. ఇది ఎందుకు పెద్ద సమస్య అని మీకు డౌట్ రావచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు సంప్రదాయ పెట్రోల్/డీజిల్ వాహనాల కంటే దాదాపు 1,850 రెట్లు ఎక్కువ పర్టిక్యులేట్ పదార్థాన్ని విడుదల చేస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఆధునిక పెట్రోల్ కారు ఎగ్జాస్ట్ నుంచి వెలువడే కణాల సంఖ్య కంటే ఇది 400 రెట్లు ఎక్కువ.


Click it and Unblock the Notifications








