ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొనేవారికి గుడ్‌న్యూస్‌.. ఒక్కరోజు ఆగితే చాలు సబ్సిడీతో తక్కువ ధరకే కొనవచ్చు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ని రేపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యతం కీలకంగా ఉన్న ఆటోమొబైల్ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చొరవతో ఆటో రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌, సీఎన్‌జీ వెహికిల్స్‌ని ప్రోత్సాహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించే విధంగా సబ్సిడీల ప్రకటన, ఇతర పన్నుల నుంచి మినహాయింపులు ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కీలకమైన ఆటోమోబైల్‌ రంగానికి ఈ 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌ ఎంత మేర ఊతమివ్వనుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి అనేక ప్రకటనలు, సబ్సిడీలు ఉండనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ సబ్సిడీపై తీపి కబురు ఇవ్వనుంది.

Union-Budget-On-Electric-Vehicles

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఇస్తున్న ఫేమ్‌2 సబ్సిడీ గడువు మార్చి 31తో ముగిసింది. సబ్సిడీ ఆపివేయడంతో ఈవీ సేల్స్‌ తగ్గాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కొత్త ప్రకటనలు చేయకుండా మధ్యంతర కాలానికి గ్రాంట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఫేమ్ సబ్సిడీ ప్రకటిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రకటన వెలువడితే ఇందులో ఇచ్చే రాయితీలు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలను గణనీయంగా తగ్గిస్తాయనే అంచనా ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడంతో పాటు భవిష్యత్తులో భారతదేశంలో వాయు కాలుష్య స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ సబ్సిడీని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సబ్సిడీపై పూర్తి ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సబ్సిడీ అందిచేందుకు నిధుల కేటాయింపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆటో రంగానికి చెందిన మిగతా అన్ని ప్రకటనలు తర్వాత వెలువడే అవకాశం ఉంది.

భారతదేశంలో హైబ్రిడ్ వాహనాలపై జీఎస్‌టీ తగ్గించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 1200 సీసీ, 4000 MM కంటే ఎక్కువ పొడవున్న వాహనాలపై 15 శాతం సెస్ విధిస్తున్నారు. హైబ్రిడ్ వాహనాలపై ఈ పన్నును తగ్గించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. బడ్జెట్‌లో జీఎస్‌టీ తగ్గింపుపై ప్రకటనలు చేసే అవకాశం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో జీఎస్‌టీ కౌన్సిల్‌కి సిఫారసు చేసే అవకాశం ఉంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు మరియు బ్యాటరీల విడిభాగాలపై దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రకటనల ద్వారా దీనికి అవకాశం ఉంది. దిగుమతి సుంకాన్ని తగ్గించినా, తొలగించినా నేరుగా ఎలక్ట్రిక్ వాహనాల ధర మారుతుంది. భారత్ లో ఈ తరహా బ్యాటరీల ఉత్పత్తి పెరిగే వరకు దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది.

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం సంవత్సరానికి రూ .20 లక్షల కోట్ల టర్నోవర్‌ని సాధిస్తోంది. భారతదేశం అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా మారుతోంది. కొన్ని సమస్యలను పరిష్కరిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా భారత్ కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి భారీగా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ అనేది ప్రధాన అంశంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2024, 15:22 [IST]
English summary
Electric vehicles price may comes down execpctaions on union budget
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+