ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారికి గుడ్ న్యూస్.. అమౌంట్ రీఫండ్ చేస్తున్న కంపెనీలు.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. రోజు రోజుకూ వీటి వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త మోడళ్లతో స్కూటర్లు, బైకులు, కార్లను ప్రవేశపెడుతున్నాయి. కొన్ని సంస్థలు భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఫేమ్-2 కింద సబ్సిడీలను అందిస్తుంది. ఎలక్ట్రిక్ రంగానికి ఊతమిచ్చే విధంగా ఈ చర్యలకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వీటిని తయారీ సంస్థలు వమ్ము చేసుకుంటున్నాయి. సబ్సిడీ కింద వచ్చే సొమ్మును వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి.

తాజాగా దీనిపై కేంద్రం వివరణ కోరగా ఛార్జర్ ఖర్చులను వినియోగదారులకు చెల్లించేందుకు అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. దీంతో వారు కొనుగోలు చేసిన వాహన చార్జర్ల మొత్తాన్ని తిరిగి పొందనున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ వాహన చార్జర్ కోసం కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నాయి.
దేశంలో వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసంఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుంది. ఈ రంగానికి ఊతమిచ్చేందుకు అధిక మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ వస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య వంద రెట్లు అధికం కానుంది.
కేంద్ర సర్కారు ఆయా ఎలక్ట్రిక్ సంస్థలకు అందిస్తున్న ఫేమ్-2 కింద సబ్సిడీలను నిలిపివేశాయి. వీటికి వినియోగించే ఛార్జర్ల కోసం ఆయా కంపెనీలు వసూలు చేసిన మొత్తం రూ.300 కోట్లు తిరిగి కస్టమర్లకు చెల్లించనున్నాయి. ఓలా, ఏథర్, హీరో మోటో, టీవీఎస్ మోటార్ ఇందుకు తమ అంగీకారాన్ని తెలిపాయి. దీనిపై కంపెనీలు వసూలు చేసిన రుసుమును తిరిగి వారికి చెల్లించనున్నాయి. దీంతో ఆయా కంపెనీలు తిరిగి ఫేమ్-2 పథకం కింద సబ్సిడీలు పొందేందుకు అవకాశం లభిస్తుంది.
తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఓలా ఎస్1, ఎస్1 ప్రో లపై హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. వీటి విలువ రూ.131 కోట్లుగా ఉంది. దీంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహనదారులకు చెల్లించాలన్న కేంద్రం నిర్ణయంతో తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ఓలా ఈవీ కస్టమర్ల విశ్వాసాన్ని అలాగే కొనసాగించేందుకు ఛార్జర్ ధరను తిరిగి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈవీ పరిశ్రమలో తమ సంస్థ ఊహించని విధంగా గత కొన్నేళ్లలో అసాధారణ ప్రగతిని సాధించిందని ఓలా ప్రకటించింది. భవిష్యత్ లోను మరింత దూకుడుగా పనిచేస్తామని వివరించింది. మిగతా కంపెనీలు తమ వివరణను ప్రకటించాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








