క్షణక్షణం భయం.. కానీ ఏనుగు చేసిన పనికి అంతా షాక్‌.. వీడియో వైరల్‌

గత కొన్ని సంవత్సరాలుగా అనేక కారణాలతో అడవిలో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. అడవుల్లో సరైన ఆహారం, నీరు లభించక రోడ్లపైకి వస్తున్నాయి. అందుల్లో ఏనుగులు సహా మిగిలిన జంతువులు ఉంటున్నాయి. కొన్నిసార్లు ఇలా రోడ్లపైకి వచ్చిన ఏనుగులు ప్రజలను అవస్థలకు గురిచేస్తాయి. రోడ్లపైనున్న వాహనాలపై దాడిచేసేందుకు ప్రయత్నం చేస్తాయి.

అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఏనుగు వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన శ్రీలంకలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియోలో రోడ్డుపై నిలిచిపోయిన ఓ ట్రక్కును స్టార్ట్‌ చేసేందుకు ఏనుగు సాయం చేస్తుంది. ఈ ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Elephant helps to start a truck

ఈ వీడియోను ప్రదీప్‌ ఇంటికా కరియవాసం తన యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. ఈ ఘటన శ్రీలంకలోని చాలా రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లోని హబరానా అటవీ ప్రాంతంలోని రోడ్డుపై ఏనుగు కనిపించింది. ఈ వీడియోలో ఓ ట్రక్కు పక్కన అడవి ఏనుగు నిలబడి ఉండడం కనిపించింది. అయితే ఏనుగు ట్రక్కుపై దాడి చేస్తుందని అక్కడున్న వారు భావించారు. అయితే ఆ ఏనుగు చాలా ప్రశాంతంగా కనిపించింది.

అయితే రోడ్డు మధ్యలో ట్రక్కు చెడిపోయిందని తెలుస్తోంది. కానీ బయట ఏనుగు ఉందనే భయంతో ట్రక్కులో ఉన్న డ్రైవర్‌, హెల్పర్‌ కిందకు దిగేందుకు భయపడ్డారు. అయితే ఏనుగు ట్రక్కు వెనక్కి వచ్చి.. దానిని నెట్టేందుకు ప్రయత్నం చేసింది. అయినా వాహనం ముందుకు కదలలేదు.

Elephant helps to start a truck

దాంతో మరోసారి ట్రక్కును నెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో ట్రక్కు వెంటనే స్టార్ట్‌ అయింది. ఈ వీడియోను అక్కడకు సమీపంలో ఉన్న వాహనదారులు రికార్డు చేశారు. ఈ ఘటనతో కొన్ని జంతువులు ఎంత శాంతంగా ఉండి, మానవులకు ఎలా సాయం చేస్తాయో తెలిసింది.

ఈ ఘటనలో ఆహారం కోసమే ఏనుగు రోడ్డుపైకి వచ్చిందని తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లోని ప్రజలు జంతువులకు రోజువారీ ఆహారం ఇస్తారు. అందుకు కొన్ని జంతువులు అలవాటు పడుతున్నాయి. అయితే ఈ వీడియోలోని ఏనుగు మాత్రం ట్రక్కు నిలిచిందని గుర్తించి.. ఏనుగు సాయం చేయడం నిజంగా ఆశ్యర్యం అనిపించింది. ట్రక్కులోపల ఉన్న వారు బయటకు రాకుండా ఉండడం కూడా కలిగి వచ్చింది.

అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాహనం నుంచి బయటకు కనిపించకుండా ఉండాలి. అదే సమయంలో జంతువులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదు. అలానే వాటిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేయకూడదు. వీలుంటే ఏనుగులు వంటి జంతువులు రోడ్డుమీద నుంచి అడవిలోకి వెళ్లిపోయేంతవరకు వేచి చూడాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 17, 2023, 13:58 [IST]
English summary
Elephant helps to start a truck which was stopped on the road video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+