'హాలీవుడ్ సినిమా కంటే చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ ' ట్వీట్‌పై ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..

ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. చంద్రయాన్- 3 విజయంతో యావత్ దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకొంటున్నారు. ఇంతవరకూ ఏ దేశం కూడా అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్- 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా అడుగుపెట్టడంతో ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యానికి గురయ్యాయి. అగ్రనేతలు భారత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తక్కువ బడ్జెట్‌తో ఏ దేశం సాధించలేని ఘనత భారత్ సాధించడంతో ప్రపంచంలోని డెలిగేట్స్ భారత్ ప్రతిభను కొనియాడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు. అందులో స్పేస్ ఎక్స్(ట్విట్టర్) అధినేత, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ భారత్‌పై కురిపించిన ప్రశంసల జల్లు ప్రత్యేకంగా నిలిచాయి.

Elon-Musk-Chandrayaan-3

'భారతదేశం యొక్క పరాక్రమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తక్కువ బడ్జెట్‌తో అంతరిక్షంలోకి రాకెట్‌లను ప్రయోగించి మిషన్‌లను విజయవంతంగా ప్రయోగించే సామర్థ్యాన్ని భారత్ నిరూపించుకుంది. చాలా దేశాల ప్రముఖులు ప్రస్తుతం దీనిపైనే చర్చించుకుంటున్నారు.' అని భారత్‌పై మస్క్ ఎక్స్(X) వేదికగా ప్రశంసలు కురిపించారు.

హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్‌ను భారత్ విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని మస్క్ కొనియాడారు. వివరంగా చెప్పాలంటే, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇంటర్‌స్టెల్లార్ బడ్జెట్ 165 మిలియన్ల డాలర్ల వ్యయంతో పోలిస్తే, భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కేవలం 75 మిలియన్ డాలర్లు.

"ఇంటర్‌స్టెల్లార్ చిత్రం చంద్రయాన్-3 కోసం భారతదేశం ఖర్చు చేసిన దానికంటే రెండింతలు ఖర్చు చేసింది. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది" అని న్యూస్‌థింక్ ట్విట్టర్‌(ఎక్స్)లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై మస్క్ స్పందిస్తూ భారతదేశాన్ని ప్రశంసించారు. "గుడ్ ఫర్ ఇండియా" అని ట్వీట్ చేసి, ఇండియన్ ఫ్లాగ్ ఎమోజీతో ముగించారు. మస్క్ ఇచ్చిన ఈ రిప్లైకి 60,000 పైగా వీక్షణలు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్-3 ప్రాజెక్టు అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది.

చంద్రయాన్-3 యొక్క ప్రధాన లక్ష్యాలు చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉపరితలాన్ని అధ్యయనం చేయడం, నేల ఆకృతిని పరిశీలించడం, చంద్రుని భౌగోళికతను అధ్యయనం చేయడం. ఈ మిషన్ చంద్రుని పుట్టుపూర్వోత్తరాలు, వనరులపై ముఖ్యమైన వివరాలను అందజేస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ విజయం అనేక కొత్త అధ్యయనాలకు దోహదపడనుంది. రెండు వారాలపాటు ల్యాండర్ మాడ్యూల్, రోవర్ చంద్రునిపై అధ్యయనం చేయనుంది.

కాబట్టి అంతరిక్షంలోకి రాకెట్లను విజయవంతంగా ప్రయోగించడం అంత తేలికైన పని కాదని మస్క్‌కు బాగా తెలుసు. దేశంలోకి త్వరలో టెస్లా కార్లను తీసుకురాలని మస్క్ భావిస్తోంది. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వ నియమాలు మరియు ప్రమాణాలను అంగీకరిస్తే, టెస్లా కార్లు వీలైనంత త్వరగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో అత్యధిక గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లార్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్‌స్టెల్లార్‌కు దర్శకుడు, ఇది మొత్తం 165 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించిన స్పేస్ అడ్వెంచర్ మూవీ.

More from DriveSpark

Article Published On: Thursday, August 24, 2023, 15:27 [IST]
English summary
Elon musk compliments on chandrayaan 3 mission success says good for india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+