జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
ప్రముఖ సెలబ్రిటీల మాదిరిగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల 'ఎల్విష్ యాదవ్' ఓ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన జీ-వ్యాగన్ కొనుగోలు చేశారు.
గత కొన్ని రోజులకు ముందు పాము విషం కేసులో ప్రధాన నిందితుడుగా జైలుపాలైన ఎల్విష్ యాదవ్ ఈ మధ్యకాలంలోనే బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కొత్త బెంజ్ కారును చూడవచ్చు.

బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్‌కు కార్లంటే చాలా ఇష్టమని అందరికి తెలుసు. ఈ కారణంగానే యితడు ఎప్పటికప్పుడు తనకు నచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఈ53 ఏఎంజీ కారును కూడా కొనుగోలు చేశారు. కాగా ఇప్పుడు జీ-వ్యాగన్ సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ జీ-వ్యాగన్ సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఒకటి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఇలాంటి కార్లను కొనుగోలు చేశారు.
ఎల్విష్ యాదవ్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్ ధర దేశీయ మార్కెట్లో రూ.2.55 నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఎల్విష్ యాదవ్ కొత్త కారు కొనుగోలు కోసం రూ.3 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి ఉంటారని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ కారు డీజిల్ వేరియంటా లేక పెట్రోల్ వేరియంటా అనేది వెల్లడికాలేదు.

సిద్దార్థ్ యాదవ్‌గా జన్మించిన ఎల్విష్ యాదవ్ గురుగ్రామ్‌లోని వజీరాబాద్ గ్రామంలో జన్మించారు. ఇతడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు యూట్యూబర్ మరియు సింగర్ కూడా. ఎల్విష్ యాదవ్ 2016లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఇతని యూట్యూబ్ ఛానల్ ఏకంగా 14.9 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను పొందింది. 2023లో ఇతడు కొత్త గేమింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు.
మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్: భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ జీ-వ్యాగన్ ఒకటి. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు సుమారు ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బెంజ్ కారు పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ యొక్క 2925 సీసీ డీజిల్ ఇంజిన్ 325.86 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా 3982 సీసీ ఇంజిన్ 576.63 Bhp పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








