30 సంవత్సరాల్లో ఒక్క చావు కూడా లేదు: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్
అక్కడ డబ్బుకు కొదవే లేదు, విలాసానికి మారుపేరు ఆ దేశం, మతానికి ప్రాణం ఇచ్చే మనుషులు అక్కడుంటారు, ఖరీదు అనే పదం అక్కడ చాలా సాదారణం... ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకతలు వస్తూనే ఉంటాయి. అయినా ఏ దేశం గురించి ఈ రామాయణం అంతా అనుకుంటున్నారా ? రిచ్‌కి రీనేమ్‌గా చెప్పుకునే అరబ్ కంట్రీస్ గురించి.
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్‌లలో మొదటి రెండు స్థానాల్లో అరబ్ దేశాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. అందులో ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్. ఎమిరేట్స్ యొక్క గత 30 ఏళ్ల చరిత్రలో ఒక్క చావు కూడా లేదంటే నమ్మగలరా ? నమ్మాల్సిందే ఎందుకంటే ఇది నిజం. ఎన్నో ప్రత్యేకతలున్న అరబ్ దేశాల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కూడా ఒక అద్బుతం. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

ఉత్తమ భద్రత ప్రమాణాలను పాటిస్తుంనందుకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఆపరేషనల్ సేఫ్టీ ఆడిట్ ( IOSA) వారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను సేఫెస్ట్ ఎయిర్‌లైన్స్‌గా ఎంపిక చేసింది.

తాజాగ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 777-300 దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సందర్భంలో స్వల్పంగా అగ్నిప్రమాదానికి గురయింది. అయినప్పటికీ ఇందులో ఏ విధమైన ప్రాణ నష్ట సంభవించలేదు. ఇందుకు ముఖ్య కారణం ఎమిరేట్స్ పాటిస్తున్న భద్రత ప్రమణాలు.

సుమారుగా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌గా మొదటి స్థానంలో నిలుస్తూనే వస్తోంది.

జెట్ ఎయిర్‌లైనర్ క్రాష్ డాటా ఎవల్యూషన్ సెంటర్ (JACDEC) వారు దీనికి క్రాష్ రేటింగ్ పరంగా రెండవ సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌గా ఎమిరేట్స్‌ను ఎంపిక చేసారు.

అంతేకాకుండా ఎయిర్‌లైన్‌రేటింగ్.కామ్ అనే సంస్థ ఈ ఏడాదిలో విమాన ప్రయాణం చేయడానికి సూచించిన 20 అతి సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌లలో ఎమిరేట్స్ మొదటి స్థానంలో నిలిచింది.

అయితే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వారి ప్రకటన ప్రకారం, "కొన్ని సందర్బాలలో ఎమిరేట్స్ విమానాలు కొన్ని సార్లు క్రాష్ అవుతుంటాయి. అయితే ఇవి సాంకేతికంగా తలత్తేవి మాత్రమే, అందులో కూడా ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని" తెలిపింది.

కొన్ని రోజుల క్రితం ఎమిరేట్స్‌కు చెందిన బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్ సుమారుగా 300 మంది ప్రయాణికులతో తిరువనంతపురం నుండి బయలుదేరి 12:50 లకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది.

ఆ ప్రమాదంలో ఎటువంట ప్రాణ నష్టం సంభవించలేదు. దీని తరువాత ప్లేన్‌క్రాష్‌ఇన్ఫో.కామ్ అనే సంస్థ ప్రచురించిన కథనంలో గడిచిన 20 సంవత్సరాలలో ఏ విధమైన విమానా ప్రమాదాలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకోలేదని తెలిపింది.

ఎయిర్‌లైన్స్ సేఫ్టీ మరియు సెక్యురిటీ ఇన్ఫర్మేషన్ వారి దగ్గరున్న సమాచారం ప్రకారం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో గడిచిన 30 సంవత్సరాలలో ఒక ప్రాణ నష్టం కూడా సంభవించలేదని తెలిపారు.

ఎయిర్‌లైన్ సేఫ్టీ ర్యాకింగ్ సూచించే JACDEC వారి ప్రకారం ప్రపంచంలో రెండవ సురక్షితమైన క్యారీయర్‌గా ఎమిరేట్స్ మరియు క్యాథ్యా పసిఫిక్ ఎయిర్‌వేస్ వరుసగా 2015 మరియు 2016 గాను ర్యాంకింగ్స్ పొందాయి.

స్కైట్రాక్స్ అనే డైలీ ఎయిర్‌లైన్స్ ర్యాంకింగ్ వారు వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం ప్రపంచంలో ఉత్తమ ఎయిర్‌లైన్స్‌గా మొదటి స్థానంలో నిలిచింది.

ఎమిరేట్స్ సాధించిన అనేక అవార్డులు
ఎయిర్‌లైన్ రేటింగ్ ప్రకారం 2016 లో అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌లో ఇదీ ఒకటి.

స్కైట్రాక్స్ వారి ప్రకారం 2016 కి గాను ప్రపంచపు నెంబర్ వన్ ఎయిర్‌లైనర్

JACDEC వారి నుండి ప్రపంచపు రెండ అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది.

విమానయాన రంగంలో 2011 లో ఎయిర్‌లైన్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్
భారతీయ విమానాల్లో ప్రయాణిస్తున్నారా ? అయితే వీటిని మాత్రమే ఎంచుకోండి


Click it and Unblock the Notifications








