ఎలక్ట్రిక్ వెహికల్ కొనే వాళ్లకు గుడ్‎న్యూస్..ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఇకపై 15 ఏళ్ల తర్వాత కూడా వాటిని వాడొచ్చు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, వాటి వినియోగాన్ని సాధారణం చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. వీటిలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న వాళ్లకు గుడ్ న్యూస్. పాత వాహనాలను 15 ఏళ్ల తర్వాత స్క్రాప్ చేసే(End of Life) నిబంధన ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించదని ప్రభుత్వం త్వరలో స్పష్టం చేయనుంది. అంటే, ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, ట్రక్కులు 15ఏళ్ల తర్వాత కూడా రోడ్లపై నడవవచ్చు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తల ప్రకారం.. విద్యుత్ మంత్రిత్వ శాఖ త్వరలో CAFE (Corporate Average Fuel Economy) నిబంధనలను పట్టణ వస్తు రవాణా వాహనాలు, ట్రక్కులు, బస్సులకు కూడా విస్తరించబోతోంది. ఇంధన వినియోగం, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడమే CAFE నిబంధనల ముఖ్య ఉద్దేశ్యం. ఈ చర్యలు నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు.

Electric Vehicles

2024లో ఈవీల వాటా కేవలం 7.6% మాత్రమే ఉండగా, 2030నాటికి 30% లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈవీల విస్తరణ టూ వీలర్, త్రీ వీలర్, బస్సుల విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ, ఫోర్ వీలర్ వాహనాల్లో (కార్లు) నెమ్మదిగా ఉంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల వినియోగం ఇంకా మొదలవ్వలేదు. రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి వి. ఉమాశంకర్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల కన్నా పాత బస్సులు ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్నాయని తెలిపారు.

దీనిపై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఈవీలకు 15 ఏళ్ల EoL నిబంధన వర్తింపజేయకపోతే, వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని సూచించారు. ఈవీల వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు (ఎకోసిస్టమ్) ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరి నిబంధనలు బాగా పనిచేస్తాయని ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు.

Mahindra Electric Car

ఈవీల వినియోగాన్ని వేగవంతం చేయడానికి, కేవలం ప్రోత్సాహకాల నుంచి తప్పనిసరి నిబంధనల వైపు దృష్టి సారించాలని, ఈవీలను ఉపయోగించని వారికి ప్రతికూలతలను కల్పించడంపై కూడా చర్చ జరిగింది. దీంతో పాటు ఐదు నగరాల్లో బస్సులు, ఆటోలు, ఇ-రిక్షాలు, పట్టణ వస్తు రవాణా వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చే వ్యూహంపై కూడా చర్చించారు.

ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేయడం, ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడంపై దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. బ్యాటరీల కోసం దిగుమతులపై ఆధారపడకుండా, దేశంలోనే కొత్త బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులకు సులభంగా రుణాలు (ఫైనాన్స్) అందించాల్సిన అవసరంపై అందరూ ఏకీభవించారు. ఈ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులతో చర్చలు జరిపింది.

ఈవీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. ఎందుకంటే, వాటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బ్యాటరీలను స్టాండర్డైజ్ చేయాలని, వాహనాల ధరలను తగ్గించాలని, కొత్త బ్యాటరీలు కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. బ్యాటరీని సాధారణంగా 6-7ఏళ్లలో మార్చాల్సి వస్తుందని, ఇది ఈవీల మొత్తం ఖర్చులో 40-50% ఉంటుందని బ్యాంకులు పేర్కొన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2025, 10:42 [IST]
English summary
End of life rule relaxed for evs government accelerates electric vehicle adoption
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+