మీ కారులో ఈ ఫీచర్‌ ఉందా.. సరిగ్గా వినియోగిస్తే భారీగా డబ్బు ఆదా చేయవచ్చు..!!

కారు కొనుగోలు చేస్తున్న సమయంలో ధర, సెక్యూరిటీ ఫీచర్లతోపాటు ముఖ్యంగా మైలేజీ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. అయితే కారు మంచి మైలేజీ ఇచ్చేందుకు కొన్ని చిట్కాలుతోపాటు కారులో ఉండే ఫీచర్‌ను సరిగా వినియోగించుకోవడం వల్ల మైలేజీని పొందవచ్చు, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు.

ఐడిల్‌ స్టార్ట్‌/ స్టాప్‌ : ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వస్తున్న కార్లు చాలా వరకు ఇంజిన్‌ ఐడిల్‌ స్టార్ట్‌/ స్టాప్‌ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌, డియాక్టివేట్‌ చేసేందుకు డ్రైవర్‌ వద్ద ఓ ప్రత్యేకమైన బటన్‌ ఉంటుంది. ఈ బటన్‌ను ఆన్‌ చేయడం ద్వారా ఐడిల్‌ స్టార్ట్‌/ స్టాప్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయవచ్చు. అదే వద్దనుకుంటే బటన్‌ను ఆఫ్‌ చేయడం ద్వారా ఫీచర్‌ను డియాక్టివేట్‌ చేయవచ్చు.

Engine idle start and stop feature

ఫీచర్‌ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు కారు ఎక్కడైనా నిలిచినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజిన్‌ను ఆఫ్‌ చేస్తుంది. అవసరం అయినప్పుడు తక్కువ సమయంలోనే ఇంజిన్‌ను ఆన్‌ చేయవచ్చు. ఈ ఫీచర్‌ చాలా ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌లో కారును నిలిపేస్తే... కొన్ని సెకన్లపాటు కారులో ఎలాంటి కదలిక లేకుంటే ఈ ఫీచర్‌ కారణంగా ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చాక బ్రేక్ పెడల్‌ను మెల్లగా ప్రెష్‌ చేస్తే ఇంజిన్‌ మళ్లీ స్టార్ట్‌ అవుతుంది.

ఫలితంగా ఇంధనం భారీగా ఆదా అవుతుంది. ఫలితంగా మైలేజీ అధికంగా వస్తుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ ఐడిల్‌ స్టార్ట్‌/ స్టాప్‌ ఫీచర్‌ ఎంతో వినియోగపడుతుంది. దీంతోపాటు పెట్రోల్‌ వినియోగం కారణంగా పర్యావరణానికి జరిగే నష్టం అంటే కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

Engine idle start and stop feature

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఇంజిన్‌ ఆన్‌లో ఉంటే, ఇంధనం ఖర్చుతోపాటు కాల్యుషం కూడా పెరుగుతుంది. ఈ ఫీచర్‌తో డబ్బు ఆదాతోపాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. నగరాలు, ఎక్కువగా ట్రాఫిక్‌ ఉండే ప్రాంతాలు సహా జాతీయ రహదారులపై టోల్‌ గేట్ల వద్ద ఎక్కువ సమయం పాటు కారును నిలపాల్సి రావచ్చు. అటువంటి ప్రాంతాల్లో ఈ ఫీచర్‌ను ఆన్‌ చేయవచ్చు.

ఐడిల్‌ స్టార్ట్‌ / స్టాప్‌ బటన్‌ను అవసరమైనప్పుడు ఆన్‌, ఆఫ్‌ చేసుకోవచ్చు. రోడ్డు, ప్రాంతం బట్టి డ్రైవర్‌ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రయాణంలో ఎక్కువ ప్రాంతాల్లో కారును నిలపాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ ఫీచర్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ పాత మోడల్‌ కార్ల అందుబాటులో ఉండే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం లాంచ్‌ అవుతున్న కార్లు ఈ ఫీచర్‌తో వస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య : చాలా మంది కారు యజమానులకు తమ వాహనాల్లో ఇటువంటి ఫీచర్‌, బటన్‌ ఉందనే అవగాహన ఉండదు. ఎక్కువ మంది దీనిని మైలేజ్‌ బటన్‌గా పొరబడతారు. మీకారులో ఈ ఫీచర్‌ ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఉండే భారీగా డబ్బు ఆదా చేయగలుగుతారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 3, 2023, 19:11 [IST]
English summary
Engine idle start and stop feature used to save fuel and can increase mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+