Pani Puri Cart రాయల్ ఎన్‌ఫీల్డ్ పై పానీపూరీ అమ్ముతున్న యువతీ..
భారతదేశంలో వినూత్న ఆలోచనలకు కొలవలేదు. వింత వింత అలోచనలతో దేశం వేగంతో పురోగమిస్తోంది. అలానే దేశంలో మహిళలు వివిధ రంగాల్లో వేగంగా దూసుకుపోతున్నారు. పురుషులకు ఏ మాత్రం తీసుకుపోకుండా సరికొత్త ఆవిష్కరణలతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తను ఎంచుకున్న రంగంలో ఓ యువతీ సాధించిన విజయ గాధ మీకోసం..
ఇటీవల ఓ యువతి వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పానీ పూరీ విక్రేతగా ఎలా మారిందో తన ప్రయాణాన్ని వివరించింది. 21 ఏళ్ల యువతి తను తయారు చేసిన ఫుడ్ కోర్టుతో పానీ పూరీని విక్రయిస్తోంది. దానిని రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ కి కట్టుకుని విక్రయిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

వైరల్ అవుతున్న వీడియో..
ఆమె స్ఫూర్తిదాయకమైన వీడియోను are_you_hungry007 ద్వారా Instagramలో అప్ లోడ్ తో చేయబడింది. ఆ మహిళ తనను తాను పరిచయం చేసుకుంటూ వీడియోను ప్రారంభిస్తుంది. తన పేరు తాప్సీ ఉపాధ్యాయ అని తన వయసు కేవలం 21 ఏళ్లని తను వివరిస్తుంది. ఈ మోటార్ సైకిల్ ను తయారు చేయడంలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని వీడియోలో పంచుకుంది.
"వయస్సు కేవలం ఒక సంఖ్య" అనే విషయాన్ని తాను కచ్చితంగా నమ్ముతానని పేర్కొంది. తాప్సీ ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తయిన వెంటనే ఇంటికి పరిమితం అయ్యానని... అయితే తాను మహిళ అయినందున ఇంట్లో ఉండాలని చాలా మంది బంధువులు తనతో చెప్పారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆమె ఆ మూస ధోరణికి వ్యాఖ్యలన్నింటినీ విస్మరించినట్లు తెలిపింది. తనకు నచ్చినది చేస్తేనే జీవితం సుఖమయం అవుతుందని ఆమె చెప్పింది.
ట్రక్కులోని అన్నీ..
పూర్తిగా ఇంట్లో తయారు చేసే విధంగా పానీపూరీని విక్రయించడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె తను తయారు చేసిన బండికి వీటిని కట్టి చిన్నగా తిప్పడం ప్రారంభించింది. వేయించిన పానీ పూరీలు, దానిలోనే పూరీలకు వాడే పిండిని పెట్టుకుని అక్కడే తయారు చేసి అమ్మడం ప్రారంభించింది. వివిధ ఆకుల మిశ్రమంతో పాటు పర్యావరణ అనుకూల పాత్రలతో చింతపండు, బెల్లం వంటి అనేక రకాల ఈ ట్రక్కులో పొందుపరిచింది.
ఈ వీడియో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ని ట్రక్ కి అమర్చిన విధానం చూపించలేదు. దానికి వెనుకాల ఆమె జోడించిన ట్రక్కును చూడవచ్చు. అయితే తాప్సీ దానిని నగరంలో తన ప్రదేశానికి నడుపుతున్నట్లు మనం చూడవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఫుడ్ కార్ట్‌గా మార్చడం ఇదే మొదటిసారి కాదు. దేశంలో అనేక మంది వ్యక్తులు తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లను విభిన్న ఆహార బండ్లుగా మార్చారు.
గంతంలోనూ..
అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లెట్ ఫుడ్ కార్ట్‌లలో ఒకటి 2016లో బెంగళూరు నుంచి ప్రజల ముందుకు వచ్చింది. 'బార్బెక్యూ రైడ్ ఇండియా' స్టార్టప్‌ను నడుపుతున్న నలుగురు భాగస్వాములు ఈ కార్ట్‌ను రూపొందించారు. వారు కస్టమ్‌గా ఒక బార్బెక్యూను రూపొందించారు. దానిని రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500తో జత చేశారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.
సింధీ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో నలుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులు అరుణ్ వర్మ అతని సోదరుడు కృష్ణ కుమార్ వర్మ, మనోగ్నా చౌదరి అలాగే సయ్యద్ ముజీబ్ ఈ వ్యాపారాన్ని స్థాపించారు. వారు ఈ వంటగది రూపకల్పనకు పేటెంట్‌ను కూడా పొందారు. వారు తమ వ్యాపార విస్తరణ కోసం క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా రూ. 10 లక్షలను సేకరించగలిగారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆహారం రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో కూడిన మరొక వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్‌సైకిల్ హాట్ సైలెన్సర్‌లో పాప్‌కార్న్ కెర్నల్‌లను పాప్ చేయడానికి వాటిని ఉంచడం కనిపించింది. యూట్యూబర్ మొదట బైక్‌ను స్టార్ట్ చేయడం ద్వారా అది వేడెక్కుతుంది. ఆపై కెర్నల్‌లను లోపల ఉంచుతుంది. కొంత సమయం తర్వాత సిద్ధం చేసిన పాప్‌కార్న్‌లు పాప్ అవుట్ అవుతాయి.


Click it and Unblock the Notifications








