దొంగలించిన వాహనాలను గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్
భారతదేశంలో రోజురోజుకి బైకులు, స్కూటర్లు, కార్ల దొంగతనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత అత్యాధునిక పద్దతులను ఉపయోగించి వాహనాలను తయారు చేసుకున్నప్పటికీ దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు. ఈ దొంగతనాలను పూర్తిగా రూపుమాపడానికి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

సాధారణంగా వాహన యజమానులు నిర్లక్యం వల్ల కావచ్చు లేక ఇతర కారణాల వల్ల కావచ్చు వాహనాలు దొంగలించబడతాయి. ఈ విధంగా దొంగలించబడిన వాహనాలను గుర్తించడం అంత సులభం కాదు.

దొంగలించబడిన వాహనాలకు సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్స్ లో ఇంకా చాలా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దొంగలించిన వాహనాలను గుర్తించడానికి కొంత మంది ఇంజినీర్లు పోలీసులకి సహాయం చేయడానికి ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసారు.

ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను మహారాష్ట్రలోని పూణేలో ప్రారంభించడం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా దొంగలించబడిన వాహనాలను, లేకుంటే నకిలీ నెంబర్ ప్లేట్ వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.

మహారాష్ట్రలోని పూణేలో గవర్నమేంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఇంజినీర్లు దొంగలించిన వాహనాలను గుర్తించడానికి కొత్త అధునాతన టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంక కొన్ని రోజులలో అమలులోకి రానుంది.

సాధారణంగా క్రిమినల్ కేసులవంటి వాటిని సులభంగా పరిష్కరిస్తారు, కానీ ఇత్రువంటి దొంగలించబడిన వాహనాలను గుర్తించడం కొంత కష్టంతో కూడుకున్న పని కావును ఈ కొత్త టెక్నాలజీ ద్వారా సులభతరం అవుతుందని పూణేలోని పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ విఠల్ బుండెల్ పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ కూడా ఈయన నేతృత్వంలోనే జరుగుతూ ఉంది.

అంతే కాకుండా పూణే పోలీసులు ఇప్పుడు కలిగి ఉన్న ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తామని బుండెల్ తెలిపారు.

ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి పూణే పోలీసులు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ త్వరలో అమలులోకి వచ్చినట్లైతే వాహనదారులకు ఎటువంటి నష్టం జరగదు, దొంగతనాలు చేసే వారిని కూడా పూర్తిగా అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు.
గమనిక: ఇక్కడ ఉపయోగించిన ఫొటోస్ కేవలం సూచనకు మాత్రమే.


Click it and Unblock the Notifications








