కార్ వాష్ చేయించుకుంటే బాడీ మసాజ్ ఫ్రీ!
మలేషియా అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బాడీ మసాజ్‌లు చేసే ముద్దుగుమ్మలే. మసాజ్‌లకు అత్యంత పాపులర్ మలేషియాలో ఓ 'కార్ వాష్' షాపు యజమాని తన కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించాడు. అదేంటంటే.. తన షాప్‌లో తరచూ కార్ వాష్ చేయించుకునే కష్టమర్లకు వరుసగా 9వ కార్ వాష్ సర్వీస్ తర్వాత వారికి 'భం చిక్ భం' (అదేనండి.. ఫుల్ బాడీ మసాజ్‌తో పాటు పడగది సౌకర్యం కూడా అన్నమాట) ఆఫర్ చేస్తున్నాడు.
అసలు విషయం ఏంటంటే, ఆ కార్ వాష్ షాపు యజమానికి ఓ మసాజ్ పార్లర్ కూడా ఉంది. తన వద్ద కార్ వాష్ చేయుంచునే కస్టమర్లకు 8వ కార్ వాష్‌ను తగ్గింపు ధరకు అందిస్తాడు. 9వ సారి కార్ వాష్‌ను చేయుంచుకునే వారు అందమైన అమ్మాయిలతో గడిపేందుకు అర్హతను కల్పిస్తారు. ఈ భం చిక్ భం బంపర్ ఆఫర్ ద్వారా ఇటు కార్ వాష్ బిజినెస్ నుంచి అటు మసాజ్ పార్లర్ బిజినెస్ నుంచి రెండు రకాల లబ్ధి పొందాలనేది అతగాడి ఆలోచన.
అయితే, ఈ డర్టీ డీల్ గురించి అనుమానం వచ్చిన స్థానిక అధికారులు మసాజ్ పార్లర్‌ను రైడ్ చేయగా, అక్కడికి వచ్చే కస్టమర్ల వద్ద స్పెషల్ కార్డులు ఉండటం గమనించారు. 9 సార్లు కార్ వాష్ చేయించుకున్న తర్వాత మసాజ్ పార్లర్‌లో బాడీ మసాజ్ కోసం కస్టమర్లకు ప్రత్యేకంగా ఓ కార్డును ఇవ్వటం జరుగుతుంది. మసాజ్ పార్లర్‌లో ఈ కార్డును చూపించి భం చిక్ భం పొందవచ్చు.
ఈ భాగోతాన్ని గుర్తించిన అధికారులు మసాజ్ పార్లర్‌ను మూయించడమే కాకుండా, వియత్నాంకు చెందిన 9 మంది వేశ్యలను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. మలేషియాలో బాడీ మసాజ్ పార్లర్లకు చట్టపరంగా అనుమతి ఉంటుంది. అయితే, అలాగని అక్రమంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడటానికి మాత్రం అనుమతి ఉండదు. కానీ చట్టం కళ్లు కప్పి చేసే పనులు చేసుకుని పోతూనే ఉంటారు. దీనిపై మీ స్పందనను క్రింది కామెంట్ బాక్సులో మా రీడర్లతో పంచుకోండి.


Click it and Unblock the Notifications









