Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..
లోయలో చిక్కుకున్న పెద్ద లారీని లాగేందుకు ఊరులోని ప్రజలే టో ట్రక్‌గా మారారు. భారీ సంఖ్యలో లారీ వద్దకు చేరుకొని తాళ్ల సాయంతో లోయలో చిక్కుకున్న లారీని బయటకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది.

ఈ సంఘటన నాగాలాండ్‌లోని కచ్బో గ్రామంలో జరిగింది. రహదారులు అంతంత మాత్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఓ పెద్ద లారీ లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు సదరు లారీలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

అంతేకాకుండా, లారీ కూడా లోయ చివరకు వెళ్లిపోకుండా, కొంత దూరంలోనే ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న లారీని బయటకు తీసేందుకు గ్రామస్థులంతా ఏకమయ్యారు. వందలాది మంది చేరి, భారీ తాళ్ల సాయంతో ఈ లారీని బయటకు లాగారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో చూడండి
గ్రామంలో తగిన సౌకర్యాలు లేనందునే, వారు నిత్యం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మొత్తాన్ని ఓ నెటిజన్ తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, వందల సంఖ్యలో గ్రామస్థులు ట్రక్కును తాడుతో లాగడం చూడవచ్చు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. లారీని విజయవంతంగా బయటకు లాగినందుకు గానూ గ్రామస్థులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా, రాజకీయ నాయకులను ట్యాగ్ చేస్తూ, వారికి కూడా తెలిసేలా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ప్రజలు ఎలాంటి యంత్రాలు లేకుండా, తాళ్లు మరియు వెదురు బొంగుల సాయంతో ట్రక్‌ను కొంచెం కొంచెంగా కదుపుతూ పైకి లాగారు. ఇంత భారీ ట్రక్కును సాధారణ రోడ్లపైనే లాగడం చాలా కష్టం, అలాంటి లోయ నుండి దీనిని ఎటవాలుగా పైకి లాగడం ఇంకా కష్టం.

కానీ ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి ట్రక్కును లాగడం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి ట్రక్కులు సాధారణంగా సుమారు 15 టన్నుల నుండి 20 టన్నుల బరువును కలిగి ఉంటాయి. ఇందులో కనిపించిన టాటా మోటార్స్ బ్రాండ్‌కి చెందినదిగా తెలుస్తోంది.
MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

టాటా మోటార్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారతదేశంలో నిలిపివేసిన టాటా సఫారీ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ టాటా హారియర్‌కు 7-సీటర్ వెర్షన్‌గా టాటా సఫారీ రానుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.