ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీ.. హెలికాప్టర్ కంటే వేగంగా ప్రయాణం!!

ఇప్పటి వరకు మనం చాలా టాక్సీలను చూసాము కానీ ఇది కొత్త రకం ఎలక్ట్రిక్ టాక్సీ. ఇదివరకు ఎన్నడు లేనట్టుగా ఆకాశ మార్గంలో విహరిస్తూ అతి త్వరగా గమ్యాన్ని చేరుకునేలా ఓ టాక్సీ అందుబాటులోకి రాబోతుంది. ఈ ముఖ్య ఘట్టానికి బెంగళూర్ లో జరిగే ఏరో ఇండియా ప్రదర్శన వేదిక కానుంది.

IIT మద్రాస్ విశ్వవిద్యాలయం రూపకల్పన చేసిన ఈ ప్లేన్ టాక్సీని ePlane సంస్థ అభివృద్ధి చేసింది. హెలికాప్టర్ కంటే వేగంగా అతి తక్కువ సమయంలో ప్రయాణికులను తమ లక్ష్యాలను చేరుకునేలా దీనిని రూపొందించారు. ఇందుకోసం 2017లో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ ఈ స్టార్టప్ పునాది రాయి పడింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చి.. తన సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. సమయ భావాన్ని
తగ్గించడంతో పాటు అత్యవసర సమయాల్లో ఈ ప్లేన్ ఉపయోగపడనుంది.

ఎలక్ట్రిక్ ప్లేన్ టాక్సీ

సింగిల్ చార్జింగ్ తో 200 కిలోమీటర్లు..

ఒక్కసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల ఈ ఏరో టాక్సీలో ప్రయాణించవచ్చు. electric vertical takeoff and landing (eVOTL) విధానంలో ఇది పనిచేస్తుందని ePlane సంస్థ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకమైన సిస్టంను వినియోగించినట్టు ఆ కంపెనీ తెలిపింది. కారు టాక్సీ కంటే పది రెట్లు వేగంగా ఈ టాక్సీ పరిగెడుతుందని ఆ సంస్థ CEO ప్రంజల్ మెహతా, CTO ప్రొఫెసర్ సత్య చక్రవర్తి వెల్లడించారు.

ఉబర్ కంటే రెండు రెట్లు ఎక్కువ..

ఈ ఎలక్ట్రిక్ టాక్సీలో ప్రయాణించాలంటే ఉబర్ టాక్సీకి చెల్లించే నగదు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. వేగంగా ప్రయాణించేందుకు, సమయాన్ని తగ్గించుకునేందుకు ఈ టాక్సీని ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందవచ్చని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా హెలికాప్టర్ సౌకర్యం కంటే సులభ పద్ధతిలో దీనిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఎలక్ట్రిక్ టాక్సీ

ఎక్కడైనా ఈజీగా ల్యాండింగ్.

ఈ టాక్సీకి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా సులభంగా ల్యాండింగ్ చేయవచ్చు. కేవలం 25 స్క్వేర్ మీటర్ల స్థలాన్ని మాత్రమే దీని ల్యాండింగ్ కి అవసరమవుతుంది కాబట్టి ఎక్కడైనా ఖాళీ చోటు ఉన్న స్థలాల వద్ద ఈ-ప్లేన్ టాక్సీని ల్యాండింగ్ చేయవచ్చు. 4 రెక్కలు ఈ టాక్సీకి అమర్చారు. మొత్తం ఈ ప్లేన్ బరువు 200 కిలోలు మాత్రమే. 457 మీటర్ల ఎత్తున ఈ ప్లేన్ ప్రయాణిస్తుంది. 1500 ఫీట్లకు ఇది సమానం.

ఈ ప్లేన్ కి అమర్చిన బ్యాటరీ ఫిక్స్ చేసి ఉంటుంది. దాంతో వేరే బ్యాటరీలు ePlane కి అమర్చేందుకు అవకాశం లేదు. ఇక సైజు, బ్యాటరీ కెపాసిటీ పనితీరు విషయానికి వస్తే పూర్తి వివరాలను సంస్థ వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో జరగబోయే ఏరో ఇండియా ప్రదర్శనలో దీని పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.

ఎలక్ట్రిక్ టాక్సీ

ఒకేసారి ఇద్దరు ప్రయాణించవచ్చు..

మొదటగా అర్బన్ ప్రాంతాల్లో ePlane ను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో నగరాల్లోని ముఖ్య కలుపుతూ ఈ ప్లేన్ ను నడపనున్నారు. ప్రస్తుతం ఈ ప్లేన్ లో కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే ప్రయాణించగలరు. భవిష్యత్ లో దీని సంఖ్యను పెంచే అవకాశం ఉంది.
పైలట్ సహాకరంంతో నడిచే ఈ ప్లేన్ ను డ్రైవర్ లేకుండా నడిపేందుకు సంస్థ ప్రణాళికలు చేస్తుంది.

ఈ మోడల్‌ స్టార్టప్ ను అభివృద్ధి చేయడానికి ePlane కంపెనీ సుమారు $1 మిలియన్ నిధులు (సుమారు రూ.8 కోట్లు) సేకరించింది. ఈ టాక్సీకి సంబంధించి ఏరో ఇండియా అనుమతులు ఇతర సర్టిఫికేట్స్ రావాల్సి ఉంది. ఒకసారి ఛార్జ్ చేసి దాదాపు 15 కి.మీ (దాదాపు 10 మైళ్ల వరకు) లోపు సుమారు 10 రౌండ్స్ వేసేలా సంస్థ యోచిస్తుంది. చూడాలి ఈ ఎయిర్ టాక్సీ ఎంతవరకు సక్సెస్ లెట్స్ వెయిట్ అండ్ సీ.

More from DriveSpark

Article Published On: Saturday, February 18, 2023, 14:31 [IST]
English summary
Eplane electric flying taxi made in india to travel easily in urban places
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+