వేసవి కాలంలో రైడింగ్ కోసం 10 ముఖ్యమైన చిట్కాలు
చాలా మంది సమ్మర్‌లో రైడింగ్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే శీతాకాలం కన్నా ఇది ఎంతో రైడింగ్‌కు ఎంతో అనువైనది. మీరు ముందుగా ఏ ప్రాంతానికి వెళ్లాలి అని ఆలోచిస్తారు కదా ? అపుడే వేసవి కాలంలో రైడింగ్‌కు వెళితే కలిగే ఇబ్బందులు గురించి కుడా ఆలోచించాలి. అలా ఆలోచించలేదంటే మీరు ఎండ వలన కలగే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read: మాల్యా జీవితంలోకి శని దేవుడి రంగ ప్రవేశం: ఒక్కొక్క ఆస్తి కోల్పోతున్న మాల్యా
మీరు ఆలోచించడం మానండి, ఎందుకంటే ఎండా కాలంలో డ్రైవింగ్ చేయడం వలన కలిగే ఇబ్బందులు మరియు పాటించాల్సిన నియమాల గురించి కొన్ని చిట్కాలు మీకోసం క్రింది కథనం ద్వారా అందించాము, వీటిని పాటించండి ఈ సమ్మర్ రైడింగ్‌ను ఎంజాయ్ చేయండి.

1. పుష్కలంగా నీటిని తీసుకోండి
వేసవి కాలంలో డైవింగ్ చేస్తున్నప్పుడు తరచూ నీటిని తీసుకోవడం వలన శరీరానికి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుంది. నీటి కోసం ప్రతి సారి వాహనాన్ని ఆపకుండా 2-లీటర్ల వాటర్ క్యాన్‌ను మీ వెంట తీసుకెళ్లండి.

2. కొబ్బరి నీళ్లు
శరీరంలో వేడిని తగ్గించడానికి ఉన్న మరొక మార్గం కొబ్బరి నీళ్లు. మీరు సమ్మర్‌లో రైడింగ్‌కు వెళ్లినపుడు చాలా చోట్ల రహదారుల ప్రక్కన కొబ్బరి బోండాలు అమ్ముతుంటారు. ఎక్కువగా వేడికిలోనవుతున్నపుడు ఈ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా ఈ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

3.పొరలు పొరలుగా ఉన్న దుస్తులు ధరించండి
ప్రస్తుతం ప్రాంతాలను బట్టి ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో చల్లగా ఉన్న వాతావరణం తరువాత భరించలేని వేడిగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు పొరలుగా ఉన్న దుస్తులు ధరించడం వలన వేడిన బట్టిన ఒక్కొక్క పొరను విప్పేయడం లేదా ధరించడం చేయవచ్చు. తద్వారా మీ శరీరానికి స్థిరమైన వేడి అందుతుంది.

4. సమ్మర్ రైడింగ్ జాకెట్‌ను ధరించండి
సమ్మర్ సీజన్‌లో జాకెట్, గ్లూవ్స్ మరియు ట్రౌసర్స్ వంటి ప్రత్యేకమైన రైడింగ్ దుస్తులను ధరించండి తద్వారా మీ శరీరానికి చక్కగా గాలి తగులుతుంది మరియు ప్రమాదం జరిగినా కూడా దాదాపుగా ఎటువంటి గాయాలు కాకుండా బయటపడవచ్చు.

5. షార్ట్ మరియు శరీరం కనబడే విధంగా రైడ్ చేయకండి
ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు షార్ట్స్ మరియు చర్మం కనబడే విధంగా ఉండే దుస్తులు ధరించి రైడ్ చేయడం మానుకోండి. ఎందుకంటే వేసవి కాలంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీని వలన సూర్యుని నుండి వచ్చే భరించరాని వేడిని మీ చర్మం తట్టుకోలేదు. సాధ్యమైనంత వరకు ఇంటి పాటున ఉండటం మంచింది.

6. మిట్ట మధ్యాహ్నం రైడింగ్ మానుకోండి
మీరు వేసవి కాలంలో లాంగ్ రైడింగ్ కోసం వెళ్లినప్పుడు పగటి పూట 12 నుండి 2 గంటల మధ్యలో రైడింగ్ ఆపేసి హాయిగా నీడ పాటున విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎందుకంటే రోజులో ఎండ యొక్క ప్రభావం ఈ సమయం మధ్యలో ఎక్కువగా ఉంటుంది.

7. విరామం తీసుకుంటూ రైడింగ్ చేయండి
మీరు దూర ప్రాంతాలకు వెళుతున్నపుడు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక్క సారి విరామం తీసుకుంటూ వెళ్లండి. తద్వారా మీరు ఎండ నుండి కలిగే దుష్పలితాలకు దూరంగా ఉండగలరు అంతే కాకుండా మీ వాహనం కూడా కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది. అలా విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణిస్తే అలసట వలన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

8. స్పష్టమైన దృష్టి ఉండే విధంగా గల హెల్మెట్‌ను ధరించండి
చాలా మంది హెల్మెట్ మీద నల్లటి ఫిల్మ్ ఉండే వాటిని ఎంచుకుంటారు. వీటి వలన చీకటిలో బాగా చూడవచ్చు కాని పగటి పూట అలా కాదు. కాని దీనికి ఒక మార్గం ఉంది. సాదారణ హెల్మెట్ లోపల ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించవచ్చు. ఇలా పగలు మరియు రాత్రి వేళల్లో స్పష్టంగా మీరు రోడ్డు మీద దృష్టి సారించవచ్చు.

9. తరచూ టైర్లను చెక్ చేసుకోండి
శీతాకాలం కన్నా వేసవి కాలంలో టైర్లు ఎక్కువగా పంక్చర్‌కు గురి అవుతుంటాయి. కాబట్టి మీరు తరుచూ టైరులో ఎంత మేరకు గాలి ఉందో అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు సరైన పరిమాణంలో గాలిని నింపుకోండి.

10.కరుగుతున్న తారు రోడ్లు ఉంటాయి గమనించుకోండి
మీరు ఘాట్ రోడ్ల మీద మరియు మలుపులు ఉన్న వాలు రోడ్ల మీద వెళ్తున్నపుడు నెమ్మదిగా వెళ్లండి. ఎందుకంటే వేసవి కాలంలో అధిక వేడి కారణంగా రోడ్డు మీద ఉన్న తారు కరుగుతూ ఉటుంది. అలాంటి రోడ్లు గల ఘాట్ మరియు మలుపుల వద్ద చక్రాలు జారి క్రింది పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

- కారులో మంటలు చెలరేగటానికి టాప్ 10 కారణాలు
- వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్.......


Click it and Unblock the Notifications








