చెరకుతో నడవనున్న వాహనాలు.. పెట్రోల్‌లో ఇథనాల్ మిక్స్‌ని పెంచేందుకు కేంద్రం కొత్త పథకం!
దేశంలో 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం మిక్సింగ్‌ని 20 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా 9.9 బిలియన్ లీటర్ల ఇథనాల్‌ని పెట్రోలియంలో కలుపనున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశంలో విరివిగా లభించే చెరకు పంట సాగు పెంపు మరింత అవసరమని తాజా నివేదిక తెలిపింది. ఇథనాల్ మిశ్రమం, పెట్రోలియంలో మిక్సింగ్‌కి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.
దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధనాల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి బయటకు తీస్తారు. ఫలితంగా భారత్ కీలకమైన ఈ ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ముడి చమురు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను తీసుకువస్తుంది. తదనుగుణంగా పెట్రోల్ సరఫరాను తగ్గించేందుకు పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలిపే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే ముడిచమురుపై చెల్లించే ఖర్చులు తగ్గనున్నాయి. ఇంధన రంగంలో భారత్ క్రమంగా స్వయం సమృద్ధి సాధించేలా ఈ పథకాన్ని రూపొందించారు. 2025 నాటికి అన్ని రకాల పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశంలో చెరకు సేకరణ మరింత అవసరమని భావిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ వంటి ఇంధనాలు ఉత్పత్తి చేయబడతాయి. అందువల్ల, ఈ అవశేషాల పరిమాణం పెరిగితేనే ఇథనాల్‌ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చని అంచనాకు వచ్చారు. చెరకు పంట ప్రోత్సాహకంతో పాటు చెరకును విరివిగా వాడే విధంగా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ఇథనాల్‌ని ఉత్పత్తి చేయనున్నారు.

ప్రస్తుతం ఇలాంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి ఏటా 350 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. దీన్ని ఏడాదికి 600 కోట్ల లీటర్లకు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ లక్ష్యంతో ముందుకు సాగితే 2025 నాటికి 9.9 బిలియన్ లీటర్ల ఇథనాల్‌ని పెట్రోల్‌లో కలపవచ్చు. చెరకును ఎక్కువగా పండించడం వల్ల ఇథనాల్ ఉత్పత్తితో పాటు భారత్ నుంచి విదేశాలకు చక్కెర ఎగుమతులు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇథనాల్‌ని పెట్రోల్‌తో కలపడం వల్ల విదేశాల్లో ముడిచమురు కోసం భారత్ నిరీక్షణ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఇప్పుడు క్రమంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని పెంచుతోంది. ఇప్పుడు బేసిక్ పాయింట్లను సీజన్ 200 నుంచి 300కు పెంచుతున్నారు. ప్రస్తుతం చెరకు పంట ద్వారానే ఏటా 250 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది.
2024 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ని 14 శాతం కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం నుంచి సేకరించిన ఇథనాల్ పరిమాణాన్ని పెంచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తున్నారు. 2.5 మిలియన్ టన్నుల చెక్కెర ద్వారా కూడా ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక ప్రతి లీటర్ ఇథనాల్‌కి నాలుగు మిలియన్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర ఉత్పత్తిని పెంచితే చెక్కెర మార్కెట్‌లో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. అయితే పెట్రోల్ ధరలతో పోలిస్తే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్లే ఈ ఉత్పత్తిపై భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీనిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








