ఈవీలపై జీఎస్టీ ఎఫెక్ట్.. మీ ఇష్టమైన కారు కొనాలంటే ఇక మీద మరో రూ.7లక్షలు రెడీ చేస్కోవాల్సిందే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే, ఇప్పుడు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. ఒక ట్యాక్స్ ప్యానెల్ రూ. 40 లక్షలు (సుమారు 46,000 డాలర్లు) కంటే ఎక్కువ ధర ఉన్న ఈవీలపై జీఎస్టీని పెంచాలని సూచించింది. ఇది టెస్లా, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి విదేశీ కంపెనీల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ఈటీ నివేదిక ప్రకారం.. రూ. 40 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నును 18 శాతానికి పెంచాలని ట్యాక్స్ ప్యానెల్ ప్రతిపాదించింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే, రూ. 40 లక్షల లోపు కారు ధర రూ. 7.20 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.

EV Cars to Get More Expensive Prices May Rise by Up to Rs 7 Lakh

అలాగే, ఒక కారు ధర రూ. 40 లక్షలకు మించి అంటే, ఉదాహరణకు రూ. 50 లక్షలు ఉంటే, దానిపై 28 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించారు. దీంతో ఆ కారు ధర రూ. 14 లక్షల వరకు పెరిగిపోవచ్చు. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3, 4 తేదీలలో చర్చించనుంది. ఈ కౌన్సిల్‌కు ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అంతిమ నిర్ణయం వారే తీసుకుంటారు.

భారతదేశంలో ఈవీ మార్కెట్ ఇంకా చిన్నదే అయినా, చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏప్రిల్ నుంచి జులై 2025 మధ్య దేశంలో అమ్ముడైన మొత్తం కార్లలో ఈవీల వాటా కేవలం 5 శాతం మాత్రమే. అయితే, ఇదే కాలంలో ఈవీల అమ్మకాలు 93 శాతం పెరిగి 15,500 యూనిట్లకు చేరుకున్నాయి. ఈవీలను ప్రోత్సహించడానికి 5 శాతం పన్ను విధించారు. కానీ ఇప్పుడు ఖరీదైన కార్ల విషయంలో ప్రత్యేక పన్ను అవసరమని ప్యానెల్ భావిస్తోంది.

EV Cars to Get More Expensive Prices May Rise by Up to Rs 7 Lakh

ఒకవేళ ఈ కొత్త పన్ను విధానం అమలైతే, టాటా మోటార్స్ మరియు మహీంద్రా వంటి దేశీయ కంపెనీలపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఈ కంపెనీల ఈవీలు ఎక్కువగా రూ. 20 లక్షల లోపు ధరలో ఉంటాయి. కానీ, విదేశీ కంపెనీలకు ఇది పెద్ద షాక్ కావచ్చు. ఉదాహరణకు, టెస్లా ఇటీవల భారతదేశంలో రూ. 59.89 లక్షల ప్రారంభ ధరతో మోడల్ వైను లాంచ్ చేసింది. మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ కూడా భారతదేశంలో ఖరీదైన ఈవీలను అమ్ముతున్నాయి.

జులై 2025 వరకు, టాటా మోటార్స్ 40 శాతం వాటాతో భారత ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. మహీంద్రాకు 18 శాతం వాటా ఉండగా, బీవైడీకి 3 శాతం, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూలకు కలిపి 2 శాతం వాటా ఉంది. టెస్లా ఇటీవల భారతదేశంలో రెండు కొత్త షోరూమ్‌లను ప్రారంభించి, బుకింగ్‌లను స్వీకరించడం మొదలుపెట్టింది. కానీ ఇంకా డెలివరీలను మొదలుపెట్టలేదు.

దిగుమతి చేసుకున్న కార్లపై 100 శాతం వరకు పన్ను విధించడంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు జీఎస్టీ కూడా పెంచితే, టెస్లా వంటి కంపెనీలకు భారతదేశంలో వ్యాపారం చేయడం మరింత కష్టమవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2025, 13:41 [IST]
English summary
Ev cars to get more expensive prices may rise by up to rs 7 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+