Budget 2024 ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు.. అయితే బడ్జెట్ 2024లో మీకో గుడ్‌న్యూస్..!
బడ్జెట్ 2024ను (Union Budget 2024) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంపై కీలక ప్రకటనలు చేశారు. ప్రజారవాణాలోకి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం సహా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెక్నాలజీపై యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.
దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడి కోసం ఈ మధ్యంతర బడ్జెట్ 2024లో (FAME subsidy in Budget 2024) రూ.2,671 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం సబ్సిడిల కోసం ఉద్దేశించిన FAME 2 మార్చి 31తో ముగుస్తుంది. దీంతో తాజాగా నిధులు కేటాయింపుతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన FAMEను పొడిగిస్తున్నట్లయింది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం 2015 FAME పథకం తొలిదశను ప్రారంభించింది. తొలిదశలో రూ.895 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. తొలి దశలో నేరుగా వినియోగదారులకు సబ్సిడీ అందించారు. 2019లో FAME రెండో దశ ప్రారంభం అయింది. ఈసారి రూ.10000 కోట్లు కేటాయించారు.
ఈ ఫేమ్-2 సబ్సిడి పథకం గడువు 2022 నాటికే పూర్తవ్వాల్సి ఉండగా.. కరోనా దృష్ట్యా 2024 మార్చి 31 వరకు పొడిగించారు. ఫేమ్-2లో రాయితీలను తయారీదారులకు ఇస్తున్నారు. తాజాగా మధ్యంతర బడ్జెట్‌లో కేటాయింపులతో సబ్సిడీని కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసినట్లంది. అయితే గతంలో పోలిస్తే 44 శాతం నిధుల్లో కోత విధించారు.

రెండో దశ ఫేమ్ సబ్సిడీలో భాగంగా 7000 ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లు, 55000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లు మరియు 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఈ పథకం అమలుపై డిసెంబర్‌లో సంబంధిత శాఖ పార్లమెంట్‌లో ప్రకటన చేసింది.
డిసెంబర్ 2023 చేసిన ప్రకటనలో 11.80 లక్షల వాహనాలకు సంబంధిత తయారీదారులకు రూ.5294 కోట్ల రాయితీలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ వాహనాల్లో 10.42 లక్షల ద్విచక్ర వాహనాలు, 1,22,690 తీవీలర్ వాహనాలు, 14869 వాహనాలున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది.

* భారత్‌లో 2070 నాటికి జీవో ఎమిషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగం విస్తరణ సహా ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం పరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు.
ప్రజారవాణాలోకి ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల వాటాను వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్రైవేటు కార్లలో 30 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల్లో 80 శాతానికి విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

యువతకు శిక్షణ, ఉపాధి : ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కృషిచేస్తామని, యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించి తయారీ, ఇన్‌స్టలేషన్, నిర్వహణ విభాగంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని వెల్లడించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








