Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

భారతదేశపు రవాణా వ్యవస్థలో రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి రోజూ కొన్ని లక్షల మధ్య ఇండియన్ రైళ్ల గమ్య స్థానాలకు చేరుకుంటుంటారు. తరచూ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి ప్రతి రైలుకు ఉండే చివరి పెట్టకు వెనకాల పసుపు రంగులో ఓ X మార్క్ ఉంటుంది.

ఇలా ఎందుకుంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ప్రతి రైలు పెట్టెకు చివరిలో X మార్క్ ఉండటం వెనుక రీజన్స్ ఏంటో చూద్దాం రండి...

నిజమే, కదా.... రైలు వెళ్లిపోయేటపుడు మనకు స్పష్టంగా కనబడేది చివరి రైలు పెట్టె వెనక భాగం మాత్రమే. ఆ పెట్టె చివర్లో పసుపు రంగులో ఉండే X మార్కును చాలాసార్లు చూసుంటాం. కొంత మంది చూసుంటారు, కొంత మంది గమనించి ఉండరు.

రైలు పెట్టె చివర్లో ఇలా X మార్క్ ఉంటే, ఆ రైలు ఎలాంటి సాంకేతిక లోపం లేదని అర్థం. అంతే కాకుండా, రైలు సురక్షితంగా వెళుతోందని సూచిస్తుంది.

ఇండియన్ రైల్వే ఇప్పుడు ఆ X మార్కు క్రింద ఎర్ర బుగ్గను అందించింది. ఇది ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉంటుంది.

గతంలో ఈ ఎర్ర బుగ్గ వెలగడానికి ఇంధనాన్ని ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు అన్ని రైళ్లలో కూడా వీటి స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి.

అంతే కాకుండా, X మార్కు క్రింది కుడివైపున LV అక్షరాలు ఉన్న ఒక చిన్న బోర్డు వేళాడుతూ ఉంటుంది. ఎరుపు రంగు బోర్డు మీద తెలుపు లేదా నలుపు రంగులో LV అనే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఈ బోర్డు రైలు సురక్షితంగా ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

ఒక వేళ రైలుకు చివర్లో ఈ బోర్డు లేనట్లయితే ఆ రైలులో సమస్య ఉన్నట్లు అర్థం. ఆ బోర్డు ఎక్కడైనా పడిపోతే రైలు ప్రమాదంలో పడ్డట్లే. అంటే ఆ రైలు సాంకేతిక సమస్య ఉంది, అధికారులు వెంటనే రిపేరి చేయాలని అర్థం.
Picture credit: Wiki Commons