ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఎలక్ట్రిక్ కార్లు మరియు బైక్‌ల గురించి మనం నిత్యం వార్తలో చూస్తూనే ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ విమానం గురించి విన్నారా? అవును, ఇక భవిష్యత్తులో ఎగరబోయే విమానాలు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తోనే పనిచేయనున్నారు.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, తయారీదారులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీ వైపు ప్రత్యేక దృష్టి సారించారు. అలా పుట్టుకొచ్చిందే ఈ ఎలక్ట్రిక్ విమానం. ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్ అనే ఎలక్ట్రిక్ విమాన స్టార్టప్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించింది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఈవియేషన్ ఆలిస్ అనే తేలికపాటి విమానం పూర్తిగా బ్యాటరీ పవర్‌తో పనిచేయనుంది. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2017లోనే ఆవిష్కరించారు. కాగా, ఇప్పుడు ఇందులో ఓ ప్రొడక్షన్ వెర్షన్‌ను కంపెనీ సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తమ ఆలిస్ విమానాన్ని మొట్టమొదటి సారిగా గాలిలోకి ఎగురవేయనుంది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఇజ్రాయెల్‌కు చెందిన ఈ సంస్థ గతంలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తి చార్జ్‌పై 960 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని క్లెయిమ్ చేసింది. కాగా, ఇప్పుడు దానిని 815 కిలోమీటర్లకు సవరించింది. ఈ ఎలక్ట్రిక్ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు మరియు ఇద్దరు సిబ్బందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్‌కు చెందిన ఆలిస్ ప్యాసింజర్ విమానం 2024 నాటికి సర్వీసులోకి రానుంది. కాగా, ఈ సంవత్సరం రెండవ భాగంలో తన మొదటి ఫ్లైట్‌కు ఇది సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ విమానం యొక్క ప్రయోగం ఒక సంవత్సరం ఆలస్యం అయింది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఈవియేషన్ అలిస్ నిలువు (వెర్టికల్) టేకాఫ్ కాకుండా సాంప్రదాయమై స్థిర-వింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. సాధారణ విమానం మాదిరిగానే ఇది కూడా రన్‌వేపై పరుగులు తీస్తూ, గాలిలోకి ఎగురుతుంది. ఈ విమానంలో మల్టీ-రోటర్ సెటప్ ఉంటుంది. ఆలిస్ ఈవిటిఓల్ విమానాల కంటే పెద్దదిగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఈ విమానం ప్రస్తుతం వివిధ రకాల తేలికపాటి విమానాల ద్వారా సేవలు అందించే యు.ఎస్ ప్రయాణికుల మార్కెట్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రొడక్షన్ మోడల్ మునుపటి బ్లూప్రింట్లతో పోల్చి చూస్తే, అనేక మార్పులను కలిగి ఉంటుంది, గతంలో V-ఆకారంలో టెయిల్ డిజైన్‌ను ఇప్పుడు T-ఆకారంలోకి మార్చారు.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఈ విమానంలో మాగ్నిక్స్ నుండి గ్రహించిన రెండు మాగ్నీ 650 ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ యూనిట్లు ఉంటాయి మరియు హనీవెల్ యొక్క వినూత్నమైన ఫ్లై-బై-వైర్ సిస్టమ్ ద్వారా ఇది శక్తిని పొందుతుంది. ఈ డిజైన్ "ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీ సెల్స్‌ను ఉపయోగిస్తుందని మరియు భవిష్యత్ పురోగతిపై ఆధారపడదని" కో-ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒమర్ బార్-యోహే తెలిపారు.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఎలక్ట్రిక్ విమాన విభాగంలో తన నైపుణ్యాన్ని చాటుకోవటానికి ఈవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ లిమిటెడ్ గడచిన డిసెంబరు నెలలో తమ సంస్థను ఇజ్రాయెల్ నుండి సీటెల్ ప్రాంతానికి మార్చింది. ఈ విమానానికి 2019లో న్యూయార్క్ మరియు న్యూ ఇంగ్లాండ్‌లోని ప్రాంతీయ క్యారియర్ అయిన కేప్ ఎయిర్ సహా వినియోగదారుల నుండి 150కి పైగా ఆర్డర్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

ఎలక్ట్రిక్ కార్లే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలు కూడా వచ్చేశాయ్.. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లైట్!

ఇదిలా ఉంటే, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా ఓ ఎలక్ట్రిక్ విమాన్ని తయారు చేయడంపై పనిచేస్తోంది. ఈవిటిఓఎల్ (ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండిగ్) అనే డ్రోన్ తరహా విమానాన్ని టెస్లా అభివృద్ధి చేస్తోంది. ఈ విమానం నిలువుగా గాలిలోకి ఎగురగలదు మరియు నిలువుగా నేలపై దిగగలదు.

Most Read Articles

English summary
Eviation Alice Electric Plane To Make Its First Flight This Year; Production Version Unveiled, Details. Read in Telugu.
Story first published: Friday, July 2, 2021, 17:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X