ఫార్ములా వన్ కార్లు ఎలా రూపాంతరం చెందాయంటే..
అత్యంత ప్రమాదకరమైన మరియు అంతే ఆశ్చర్యభరితమైన ఫార్ములా వన్ రేస్‌కు 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఒకప్పుడు బ్యారెల్ రూపంలో ఉండే ఈ ఫార్ములా కార్లు ఇప్పుడు అత్యంత అందంగా తయారయ్యాయి. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, ఈ ఫార్ములా వన్ కార్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాయి.
ఒకప్పుడు ఫార్ములా వన్ కార్లలో ముందువైపు స్ట్రైట్ 8 ఇంజన్లు ఉండేవి. అదే, ఇప్పటి ఫార్ములా వన్ కార్లలో వెనుక వైపు వి12 నుంచ వి8 వరకు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు ఇంజనీర్లు. ప్రతిఏటా ఫార్ములా వన్ కార్లను కొత్తగా డిజైన్ చేయటం, టెక్నాలజీని మార్చటం ఆనవాయితీగా వస్తోంది. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఫార్ములా వన్ కార్లు అనేక విధాలుగా రూపాంతరం చెందాయి.
అప్పటి ఫార్ములా వన్ కార్ల నుంచి ఇప్పటి ఫార్ములా వన్ కార్లను కేవలం రెండు నిమిషాల వీడియోలో మనం చూడొచ్చు. బొమ్మ కార్లతో యానిమేషన్ రూపంలో చూపించే ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/_GByFJjr1Fw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








