ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడి పాలిట శాపంగా మారింది. ఈ కారణంగా ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది, కానీ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల, ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి కొంత శంకిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలపైన ప్రభావం చూపుతుంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వాలు కూడా తమ వంతు ప్రయత్నాలు కూడా సాగిస్తుంది. అయితే ఇప్పుడు ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి EVRE స్మార్ట్ Park+ (పార్క్ ప్లస్) తో చేతులు కలిపింది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ఈ కంపెనీల భాగస్వామ్యం రానున్న రెండు సంవత్సరాలలో భారతదేశ వ్యాప్తంగా దాపు 10,000 ఛార్జింగ్స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాలికను సిద్ధం చేసింది. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, మాల్‌లు, హోటళ్లు మరియు కార్పొరేట్ టెక్ పార్కులు వంటి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడతాయి.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ఛార్జింగ్ స్టేషన్‌ల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడం నుంచి వాణిజ్య మరియు ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్మార్ట్ ఛార్జింగ్ మరియు పార్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేయడంలో సహకారం వరకు ఈ భాగస్వామ్యం అనేక విషయాలను కవర్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ఈ ఛార్జింగ్ స్టేటన్స్ ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ప్రకారం, కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ రూపకల్పన, నిర్మాణం, ఆపరేషన్ మరియు నిర్వహణను మొత్తం EVRE చేపడుతుంది. ఏ సమయంలో పార్క్ ప్లస్ రియల్ ఎస్టేట్ కోణాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దానిని నిర్వహిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

పార్క్ ప్లస్ ఇప్పటికే 1000 కి పైగా అపార్ట్‌మెంట్‌లు, 250 కార్పొరేట్ స్థలాలు మరియు 30 మాల్స్‌లో ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు దశలవారీగా ఇన్‌స్టాల్ చేయబడతాయి. ఈ ఏడాది చివరి నాటికి, ఢిల్లీ NCR లో 300, బెంగళూరులో 100 మరియు ముంబై మరియు పూణేలో 100 ఛార్జింగ్ హబ్‌లు ఏర్పాటు చేయబడతాయి.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ప్రస్తుతం ఈ భాగస్వామ్యం పట్టణ ప్రాంతాల్లో స్టేషన్ల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ షేరింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు, దీని కింద ప్రైవేట్ ప్రాపర్టీపై ఛార్జింగ్ స్టేషన్లు తెరిచిన వారికి కంపెనీ కమీషన్ చెల్లిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరియు అమ్మకాలతో పాటు, ఛార్జింగ్ స్టేషన్లను తెరవడానికి ప్రత్యేక పథకాలను కూడా తీసుకువచ్చారు. మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (MSME) ఛార్జింగ్ స్టేషన్లను తెరవడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

ఈ శిక్షణలో, ఛార్జింగ్ స్టేషన్ గురించి పూర్తి సమాచారంతో పాటు, దానిని నిర్వహించే కొత్త పద్ధతులు కూడా బోధించబడతాయి. ఈ శిక్షణలో, ఛార్జింగ్ మెకానిజం, సోలార్ పవర్డ్ ఛార్జింగ్ స్టేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్, సోలార్ పివి ఛార్జింగ్ కనెక్టివిటీ లోడ్లు, విద్యుత్ టారిఫ్ వంటి అనేక విషయాల గురించి మీకు సమాచారం ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ తరువాత మీరు ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్ చేసుకోవడం వల్ల మంచి మొత్తంలో సంపాదించవచ్చు.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

ఛార్జింగ్ స్టేషన్‌ను ఓపెన్ చేయాలనుకుంటే, దీని కోసం మీరు ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. దీని కోసం, మీరు ఫ్రాంఛైజీ కంపెనీ ప్రమాణాలు మరియు నియమాల ప్రకారం ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించాలి. భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పరిశీలిస్తే, చాలా కంపెనీలు ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఫ్రాంచైజీని ప్రారంభించాయి. అంచనాల ప్రకారం, ఛార్జింగ్ స్టేషన్ తెరవడానికి రూ. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గడ్ న్యూస్.. రాబోయే 2 సంవత్సరాలలో 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి శ్రీకారం

రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన డిమాండ్ కారణంగా మౌలిక సదుపాయాలు ఎక్కువ అవసరమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలావరకు సబ్సిడీలు అందిస్తుంది. కావున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రాబోయే కాలంలో పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Evre and park plus partnered to install 10000 charging stations by 2023 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X