కారుతో ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. అసలేం జరిగిందంటే..

దేశంలో రోడ్ల పరిస్థితి అంత బాగా లేదని మనందరికీ తెలిసిన విషయమే.. రద్దీగా ఉండే రోడ్లపై చిన్న వర్షం పడినా.. పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక అలాంటి రోడ్లపై హై- ఎండ్ సూపర్ కార్లను ఆఫ్-రోడ్ డ్రైవింగ్ చేయడానికి టాలా స్కిల్స్ అవసరం. సూపర్ కార్ల యజమానులు ఈ విషయం గుర్తుంచుకోవాలి.

అయితే ముంబయిలో ఇటీవల రూ. కోట్ల విలువ చేసే లంబోర్ఘినీ హురాకాన్ సూపర్‌ కారును మాజీ ఎమ్మెల్యే కొడుకు కారణంగా ప్రమాదానికి గురైంది. అంతే కాకుండా ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ కారు ప్రమాదానికి ఇలా గురికావడం ఇది రెండోసారి. గతంలో ఎమ్మెల్యే భార్య ఈ సూపర్‌ కారునే నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

Car-Accident-Lamborghini

ఇటీవల ముంబయిలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు చెందిన లంబోర్ఘినీ హురాకాన్ కారు ప్రమాదానికి గురైందని, ఈ కేసులో ఆయన టీనేజ్ కుమారుడు తక్షీల్ ప్రమేయం ఉందని తెలిసింది. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

ఇటీవల నరేంద్ర మెహతా కుమారుడు ఈ నారింజ రంగు లంబోర్ఘినీ హురాకాన్ కారులో కాలేజ్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాలేజ్ కి వెళ్లే సమయంలో అతను బాంద్రా-వర్లీ సముద్రతీర రహదారిపై కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి వంతెన రెయిలింగ్‌లను ఢీకొట్టాడు.

Car-Accident-Lamborghini

సాధారణంగానే హై పర్ఫామెన్స్ కనబరిచే ఈ సూపర్‌కార్ అకస్మాత్తుగా కంట్రోల్ తప్పిందంటే తక్షీల్ మెహతా వేగంగా వెళ్లడమే ఇందుకు కారణంగా పోలీసు నివేదికలు వెల్లడించాయి. కారు అదుపు తప్పడానికి మరో ప్రధాన కారణం వర్షం పడటం కూడా అని తెలుస్తోంది. వర్షం కారణంగా కారు హైడ్రోప్లేన్లు, బ్రిడ్జి యొక్క రెయిలింగ్లను ఢీకొట్టింది. కారు ముందు భాగం ధ్వంసమైనా అదృష్టవశాత్తూ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు తక్షీల్ మెహతాపై సెక్షన్ 279 కింద ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించినందుకు సెక్షన్ 336 కింద కేసులు బుక్ చేసినట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే కొడుకు ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత లేదు.

Car-Accident-Lamborghini

ఈ ప్రమాదంలో లంబోర్ఘిని హురాకాన్‌కు భారీగానే డ్యామేజ్ అయింది. సూపర్‌కార్ ముందు భాగం మొత్తం ధ్వంసమైందని తెలుస్తోంది. కారు వెనుక భాగం కూడా భారీగా దెబ్బతింది. కానీ, కారు పిల్లర్‌లకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇంకా అన్ని ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి తెరుచుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే ఇదే కారు ప్రమాదానికి గురికావడం ఇది తొలిసారి కాదు. ఈ కారు డెలివరీ తీసుకున్న రోజున మొదటి ప్రమాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా.. భార్య సుమన్ మెహతాకు ఈ సూపర్‌కార్‌ను బహుమతిగా ఇచ్చారు. డెలివరీ తీసుకుని వెళ్తుండగా ఆటోరిక్షాను ఢీకొట్టింది.

Car-Accident-Lamborghini

ఇక లంబోర్ఘినీ హురాకాన్ కారు స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, ఇది 610 బిహెచ్‌పి పవర్ వద్ద 560 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5.2-లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ V10 ఇంజిన్ ఉంది. ఈ కారు కేవలం 3.2 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రూ.3.5 కోట్ల ధరతో (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 5, 2023, 10:59 [IST]
English summary
Ex mla son crashes lamborghini huracan car worth rs 3 5 crore video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+