లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (Exide Industries) త్వరలో లిథియం-అయాన్ బ్యాటరీని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల లిథియం-అయాన్ (లి-అయాన్) సెల్ పరిశ్రమలోకి ప్రవేశించినట్లు కూడా ప్రకటించింది. అంతే కాకుండా కంపెనీ భారతీయ మార్కెట్లో గిగావాట్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం.. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వ ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక పథకంలో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎక్సైడ్ దాని అనుబంధ సంస్థ ఎక్సైడ్ లెక్లాంచే ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రాండ్ నెక్స్‌చార్జ్ కింద) ద్వారా లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్‌లు మరియు జాయింట్ వెంచర్ భాగస్వామి స్విట్జర్లాండ్‌లోని లెక్లాంచె SAతో ఎనర్జీ సొల్యూషన్‌లో కూడా ప్రవేశించింది.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క అత్యాధునిక R&D కేంద్రంతో, అనుబంధ సంస్థ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేయడం మరియు భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ మరియు గ్రిడ్ ఆధారిత అప్లికేషన్‌ల కోసం శక్తి నిల్వ వ్యవస్థలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

ఎక్సైడ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద లెడ్ యాసిడ్ నిల్వ బ్యాటరీ తయారీ సంస్థల్లో ఒకటి. కంపెనీ అనేక రకాల లెడ్ యాసిడ్ బ్యాటరీలను డిజైన్ చేసి, తయారు చేయడమే కాకుండా మార్కెట్ చేస్తూ విక్రయిస్తుంది. కంపెనీ ఆటోమోటివ్, పవర్, టెలికమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు, కంప్యూటర్ పరిశ్రమలతో పాటు రైల్వే, మైనింగ్ మరియు డిఫెన్స్ రంగాల కోసం బ్యాటరీలను తయారు చేస్తుంది.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

ఎక్సైడ్ కంపెనీ కస్టమర్ నెట్‌వర్క్ భారతదేశంతో సహా ఆరు ఖండాల్లోని 60 దేశాలలో విస్తరించి ఉంది. దీని గురించి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎండీ మరియు సీఈఓ సుబీర్ చక్రవర్తి మాట్లాడుతూ.. మేము ఇప్పుడు మల్టీ జిడబ్ల్యు లిథియం అయాన్ సెల్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాము.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

అంతే కాకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అధునాతన రసాయన కణాల ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి సమీకృత ప్రోత్సాహక పథకంలో పాల్గొనాలని కూడా మేము ఆలోచిస్తున్నాము. సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది లిథియం-అయాన్ బ్యాటరీ ఉత్పత్తి గొలుసులో అంతర్భాగంగా ఉంది. ఈ ప్లాంట్ స్థాపన వలన మేము మరింత ఖర్చుతో కూడిన పోటీని మరియు వినియోగదారులకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

PLI స్కీమ్ అంటే?

భారతదేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుమతి పరిమాణాన్ని చాలా వరకు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం PLI ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని తయారీ యూనిట్లలో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ విధంగా చేయడం వల్ల దిగుమతులు కూడా చాలా వేగంగా తగ్గించవచ్చు.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

దీని కోసం, 2020-21 కేంద్ర బడ్జెట్‌లో, 13 పరిశ్రమ రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆటోమొబైల్ రంగానికి రూ.26,000 కోట్లతో పీఎల్‌ఐ పథకం ఆమోదం పొందింది. ఈ పథకం కింద, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అసెంబ్లీలు, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్‌లు, సెన్సార్లు, సూపర్ కెపాసిటర్లు, సన్‌రూఫ్‌లు, అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లు తయారు చేసే కంపెనీలు ఆటో పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తాయి.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

దేశంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మరియు సెమీకండక్టర్ భాగాల కోసం చైనాపై దిగుమతి కోసం ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆటో పరిశ్రమ ప్రోత్సహించబడుతోంది. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా దేశీయ మార్కెట్‌పై ఆధారపడటం లేదు. ఇందులో చాలా వరకు విదేశాలనుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. కావున ఇలాంటి పరిస్థితిని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

భారతదేశంలో తయారైన వాహనాలకు సంబంధించిన అనేక పరికరాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉండటానికి చైనాపై ఆధారపడటాన్ని చాలా తగ్గించుకోవాలి. కావున స్వదేశీ ఉత్పత్తులను పూర్తిగా పెంచుకోవాలి.

లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి నేను సిద్ధం అంటున్న ఎక్సైడ్: పూర్తి వివరాలు

భారతదేశంలో వచ్చే రెండేళ్లలో బ్యాటరీల ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా బ్యాటరీల ధరలు తగ్గితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయని కేంద్ర సలహాదారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. దీనికోసం భారతదేశ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, సామర్థ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దీనికోసం నిరంతరం కృషి జరుగుతూనే ఉంది. మొత్తానికి కంపెనీ ఎక్సైడ్ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తే తప్పకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Exide industries to produce lithium ion batteries to setup gigafactory
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X