కారు రేటు ఎంతైతే ఏంటి? ఇది ముఖ్యం బిగిలూ.. (వీడియో)

ప్రపంచం టెక్నాలజీ వైపు ఎంత వేగంగా పరుగులు పెట్టినా.. కొన్ని ఆచారాలు, పద్ధతులు మాత్రం శాశ్వతంగా మనతోపాటు సాగుతూ ఉంటాయి. దీనికి నిలువెత్తు నిదర్శనమే ఇటీవల బెంగళూరులో జరిగిన సంఘటన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

భారతీయ సనాతన ధర్మాన్ని హిందువులు ఏ పని ప్రారభించాలన్నా.. మొదటి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుని ప్రారంభిస్తుంటారు. ఈ సంగతి అందరికి తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కారుకైన ముందు పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు.. మళ్ళీ ఇలాంటి సన్నివేశం బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bentley Bentayga Car Gets Traditional Hindu Vahan Pooja

వీడియోలో గమనించినట్లయితే.. బ్రిటీష్ బ్రాండ్ ఖరీదైన 'బెంట్లీ బెంటాయగా' (Bentley Bentayga) కారుకు ఒక గుడి దగ్గర పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చూడవచ్చు. ఇందులో ఇద్దరు పండితులు కారుకు పూజ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో మూలలను మరచిపోకూడదు అనే ట్యాగ్ ఉండటం చూడవచ్చు. ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లు సమాచారం.

సెయింట్ జేమ్స్ రెడ్ అని పిలువబడే కలర్ ఆప్షన్ పొందిన బెంట్లీ బెంటాయగా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని ధర రూ.5 నుంచి రూ.7 కోట్లు వరకు (ఆన్-రోడ్ ప్రైస్ బెంగళూరు) ఉంటుందని తెలుస్తోంది. నిజానికి ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఖరీదైన కార్లలో బెంట్లీ బెంటాయగా చెప్పుకోదగ్గ మోడల్. ఇది మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 600, రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Bentley Bentayga Car Gets Traditional Hindu Vahan Pooja

బెంట్లీ బెంటాయగా లాంగ్ వీల్‌బేస్ మరియు షార్ట్ వీల్‌బేస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న మోడల్ షార్ట్ వీల్‌బేస్ మోడల్ అని తెలుస్తోంది. ఇది 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 542 Bhp పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

వాహన పూజ అంటే..

భారతదేశంలో వాహన పూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ఆచారం ప్రకారం చాలామంది తమ కొత్త వాహనాలకు (కార్లు, బైకులు) తప్పకుండా పూజ చేస్తారు. మరి కొందరు విజయదశమి (దసరా) రోజు కూడా తమ వాహనాలకు పూజ చేసే సంప్రదాయం దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ఉంది. ఇవన్నీ దేవతల ఆశీర్వాదం కోసం జరిగే పూజలని శాస్త్రాలు చెబుతున్నాయి.

వాహనాలకు పూజ నిర్వహించే క్రమంలో వాహనాన్ని మొదటి శుభ్రపరిచి.. ఆ తరువాత పూజారులు కారు లేదా బైకుకు పసుపు, కుంకుమ లేదా గంధం వంటివి పూయడం చేస్తారు. ఆ తరువాత అగారబత్తులు వెలిగించడం, పువ్వులు పెట్టడం, కొబ్బరి కాయలు కొట్టడం వంటివి చేస్తారు. ఆ తరువాత వేదమంత్రాలు లేదా ప్రార్థనలతో పూజలు పూర్తి చేస్తారు.సురక్షితమైన ప్రయాణం కోసం, దేవతలు ఆశీర్వచనములు పొందటం కోసం ఈ పూజలు జరుపుకుంటారు.

భారతదేశంలో వాహనాలకు పూజలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలామంది తమ లంబోర్ఘిని కార్లకు పూజలు చేసుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్‌లో లంబోర్ఘిని హురాకాన్ (Lamborghini Huracan) కారుకు పూజారులు పూజ చేసిన ఘటన బెంగళూరులోనే వెలుగులోకి వచ్చింది. పూజ పూర్తయిన తరువాత కారు రోడ్డు మీదకి రావడం చూడవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2024, 16:00 [IST]
English summary
Expensive bentley bentayga car gets traditional hindu pooja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+