ఒకేచోట ఇన్ని లగ్జరీ కార్లు ఎప్పుడైనా చూశారా? అంతా అతిధుల కోసమే!
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు, భారతీయ కుబేరుడు అంబానీ ఏం చేసినా ప్రత్యేకమే. వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకులైన అంబానీ ఇటీవల తన చిన్న కుమారుని వివాహన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో అనంత్, రాధిక వివాహం కూడా ఒకటిగా నిలిచింది. సుమారు రూ. 5వేలకోట్లు ఖర్చు చేసి అనంత్ అంబానీ పెళ్లి చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అంబానీ ఇంట జరిగిన పెళ్ళికి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. పెళ్ళికి వచ్చిన అతిధులను తరలించడానికి వీరు చాలా ఖరీదైన కార్లను ఉపయోగొంచినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అంబానీ ఇంట జరిగిన పెళ్లి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర దేశాల పారిశ్రామిక రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరనారి సౌకర్యార్థం ముకేశ్ అంబానీ ఫ్యామిలీ చాలా ఖరీదైన కార్లను బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎన్ని ఖరీదైన కార్లు అక్కడ ఉన్నాయో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంబానీ ఆధిపత్యం అనే క్యాప్షన్‌తో వీడియోను జాన్హవి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. సభ వేదిక బయట ఈ కార్లన్నీ పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులో చాలా వరకు ప్రీమియం కార్లు, లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. కార్లు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్నప్పుడు.. అటుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు దీనికి సంబందించిన వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో లెక్కకు మించిన అన్యదేశ్య బ్రాండ్స్ కనిపిస్తున్నాయి.
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కార్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్, ఏ క్లాస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, బేంగ్ జీఎల్ఎస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు ఇన్నోవా హైక్రాస్ వంటి మరిన్ని కార్లు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు అద్దెకు (రెంట్) తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అంబానీ అతిధుల కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రత్యేకంగా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లైనప్‌లోని చాలా కార్లు చాలా ఖరీదైన కార్లు అని తెలుస్తోంది. కొన్ని కార్లను అంబానీ ఈవెంట్ కోసం వారు అద్దెకు తీసుకున్నారు. మరి కొందరికి అంబానీ గ్యారేజిలోని కార్లనే ఉపయోగించినట్లు తెలుస్తోంది. అనంత్, రాధికల పెళ్ళికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరియు ఆమె భర్త నిక్ జోనాస్ తమ ఖరీదైన వాహనంలో వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉండగా అనంత్ అంబానీ.. తాను ప్రయాణించడానికి రోల్స్ రాయిస్ కారును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారును చాలా అందంగా పువ్వులతో అలంకరించారు. పువ్వులతో అలంకరించబడిన ఆ కార్లు ముంబై నగర వీధుల్లో వెళుతూ కనిపించాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో ఏకంగా తొమ్మిది కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. వారికి రోల్స్ రాయిస్ కార్లంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి అంబానీ గ్యారేజిలో ఒక్క రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ కార్లు, బీఎండబ్ల్యూ, ఆడి, రేంజ్ రోవర్, ఫెరారీ మరియు లంబోర్ఘిని వంటి ఖరీదైన కార్లు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. అంబానీ సెక్యూరిటీలో కూడా ఖరీదైన కార్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సెక్యూరిటీ మరియు రోజు వారీ వినియోగాలకు మాత్రమే కాకుండా.. అంబానీ కుక్క కోసం బెంజ్ జీ400డీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








