భారతదేశంలో ఖరీదైన నెంబర్ ప్లేట్ ఇవే!.. ఒక్కొక్కటి అన్ని లక్షలా..

వాహన ప్రేమికులు తమకు నచ్చిన కార్లను మాత్రమే కాకుండా మెచ్చిన నెంబర్ ప్లేట్స్ కోసం ఎంత డబ్బయినా వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకాడటం లేదు. మన దేశం ఉన్న అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్స్ గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

టయోటా ఫార్చ్యూనర్

జేమ్స్ బాండ్ సినిమాలను విపరీతంగా అభిమానించే వ్యక్తి కారు కొంటే ఏమవుతుంది.. 007 నెంబర్ ప్లేట్ కోసం తాపత్రయపడతాడు. ఈ నెంబర్ కోసం కొన్ని సంవత్సరాల క్రితం 'ఆషిక్ పటేల్' అనే వ్యక్తి రూ. 34 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. అయితే యితడు కొన్న కారు ఖరీదు రూ. 30 లక్షలు, కారు కోసం నెంబర్ ప్లేట్ రూ. 34 లక్షలు.

Porsche 718

పోర్స్చే 718 బాక్స్‌స్టర్

కేరళకు చెందిన కేఎస్ బాలగోపాల్ అనే వ్యాపారవేత్త తన పోర్షే 718 బాక్స్‌స్టర్ కారు కోసం KL 01 CK 0001 రిజిస్ట్రేషన్ నెంబర్ కొనుగోలు చేశారు. ఈ నెంబర్ కోసం ఈయన రూ. 31 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. పోర్స్చే 718 బాక్స్‌స్టర్ కారు ధర రూ. 90 లక్షలు కాగా.. ఈ కారు నెంబర్ కోసం రూ. 31 లక్షలు వెచ్చించారు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ200

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా బ్రాండ్ 'ల్యాండ్ క్రూయిజర్'. ఇందులో ఎల్సీ200 మోడల్ కొనుగోలు చేసిన బాలగోపాల్‌ అనే వ్యక్తి 0001 అనే నెంబర్ ప్లేట్ కోసం రూ.18 లక్షలు ఖర్చు చేశారు. అంతే కాకుండా చండీగఢ్‌కు చెందిన రజిత్ సింగ్ అనే వ్యక్తి కూడా తన ల్యాండ్ క్రూయిజర్ కోసం CH 01 AN 0001 అనే నెంబర్‌ను రూ.17 లక్షలు ఖర్చు చేసి సొంతం చేసుకున్నారు.

Jaguar XJ L

జాగ్వార్ ఎక్స్‌జేఎల్

రాహుల్ తనేజా ఆటో-రిక్షా డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రారంభం నుంచే న్యూమరాలజీని బాగా విశ్వసించే ఈయన తన జాగ్వార్ ఎక్స్‌జేఎల్ సెడాన్ కోసం RJ 45 CG 0001 నెంబర్ కొనుగోలు చేశారు. దీని కోసం ఇతడు రూ. 16 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. న్యూమరాలజీ నమ్మే వ్యక్తులు చాలామంది తప్పకుండా అదృష్ట సంఖ్యలను ఎంచుకుంటారు. అలంటి కోవకు చెందిన వారిలో రాహుల్ తనేజా ఒకరు.

బీఎండబ్ల్యూ 5 సిరీస్

రాహుల్ తనేజా గ్యారేజిలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ కూడా ఉంది. ఇది అతని మొదటి కారు. ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం రూ. 10.31 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ బీఎండబ్ల్యూ కారును విక్రయించారు. కానీ నెంబర్ మాత్రం అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు ఆ నెంబర్ తన బీఎండబ్ల్యూ 7 సిరీస్‌లో ఉపయోగిస్తున్నారు.

Toyota Land Cruiser

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300

ఇటీవల తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త TG 09 9999 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం రూ. 25.5 లక్షలు వెచ్చించారు. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం ఆన్‌లైన్ వేలంలో '9999' అత్యధిక బిడ్ మొత్తానికి అందుకుంది. ఈ నెంబర్ కొనుగోలు చేసిన కారు యజమాని తన హై ఎండ్ నంబర్ ప్లేట్ 'TG-09 9999' కోసం రూ.25,50,002 చెల్లించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు తెలిపారు.

ముఖేష్ అంబానీ రోల్స్ రాయిస్ కల్లినన్‌

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన రోల్స్ రాయిస్ కల్లినన్‌ కారు కోసం 0001 అనే నెంబర్ ఎంచుకున్నారు. ఈ నెంబర్ కోసం ఆయన రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. నిజానికి ఆ కారు పెయింట్ కోసం కోటి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే చాలామంది తమ కార్లకు ఫ్యాన్సీ నంబర్స్ ఉండలని భావించి ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2024, 9:00 [IST]
English summary
Expensive registration number plates in india
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+