యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ

By Anil

భారతీయ ఆర్మీ విభాగం అత్యంత శక్తివంతమైన సైనిక బలాన్ని కలిగి ఉంది. కాని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంకరమైన యుద్దాలు చేయాల్సివచ్చినపుడు దేశం మొత్తం ఉద్వేగానికి లోనవుతుంది. అందుకు నిదర్శనం సియాచిన్‌లో రెస్క్యూ నిర్వహిస్తున్న పది మంది సైనికులు మంచు చరియలు విరిగపడి మరణించిన సంఘటన. కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా శత్రుమూకలను ఎదుర్కోవడానికి అధునాతమైన యుద్ద ఆయుధాలను ఉపయోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్

ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో చాలా దేశాలు తమ సైనిక బలంతో పాటు ఆయుధ బలాన్ని కూడా పెంచుకుంటున్నాయి. అయితే భారత్‌కు యుద్దం చేయాల్సిన సంఘటణ ఎదురైతే, ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ వద్ద ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి. వీటి ద్వారా దేశ ప్రజలకు ఎంత వరకు భద్రత ఉంటుంది. వాటి బలాలు, బలహీనతలు ఏంటి అనే దానికి గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

9. ఇఎల్/డబ్ల్యూ-2090

9. ఇఎల్/డబ్ల్యూ-2090

ఇఎల్/డబ్ల్యూ-2090 దీనిని ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని సంభోదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ మరియు కంట్రోల్ సిస్టమ్‌లో ఇది అత్యంత అధునాతనమైనది. దీనిని ఇప్పుడు మన దేశ రక్షణ రంగం ఉపయోగిస్తున్నారు.

ముఖ్య లక్ష్యం

ముఖ్య లక్ష్యం

యుద్ద సమయంలో దీనిని గగన తలానికి రారాజు అని చెప్పవచ్చు. రహస్యంగా యుద్ద భూమి ఉపరితలంపైన తిరిగాడుతూ తన డేగ కన్ను ద్వారా శత్రుమూకలను గుర్తించి సైన్యానికి సంకేతాలు పంపుతుంది. యాధృఛ్చికంగా ఇది విడుదల చేసే పౌనఃపున్యం ద్వారా ఎలక్ట్రానిక్ స్కాన్ యుద్ద భూమిని గాలిస్తుంది. తద్వారా అక్కడ గుర్తించిన సమాచారాన్ని కంట్రలో రూమ్‌కు చేరవేస్తుంది.

8. టి-90 భీష్మా

8. టి-90 భీష్మా

టి-90 భీష్మా అని ఈ యుద్ధ ట్యాంకుకు నామకరణం చేసినప్పటికీ ఇది రష్యాలో తయారైన మూడవ తరానికి చెందిన శక్తివంతచమైన యుద్ధ ట్యాంకు ఇది. దీని ముందు వైపున 125 ఎమ్ఎమ్ గల 2ఎ46 స్మూత్ బోర్ గల గన్ కలదు. మరియు ఇందులో 1ఎ45టి ఫైర్ కంట్రోల్ వ్యవస్థ కలదు.

Picture credit: cell105/Wiki Commons

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

భద్రత పరంగా ఇది యుద్ధ భూమిలో ప్రము భూమిక పోషిస్తుంది. స్టీల్ బాడీని కలిగి ఉండటం, కాంపోసిట్ ఆర్మర్, పొగను విడుదల చేయడం, కోంటాక్ట్ -5 అనే ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్స్‌ను, లేజర్ వార్నింగ్ ఇవ్వడం వంటి ఎన్నో ప్రత్యేకతలను ఇది కలిగి ఉంది.

Picture credit: cell105/Wiki Commons

7. పినాకా

7. పినాకా

పినాకా అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్. దీనిని డిఆర్‌డిఓ అభివృద్ది పరిచింది. కార్గిల్‌లో జరిగిన యుద్దంలో ఈ పినాకా రాకెట్ లాంఛర్‌ను ఉపయోగించి యుద్దాన్ని సమతుల్యం చేశారు.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

దీనిని ఉపయోగించి 40 కిలోమీటర్లు మరియు 65 కిలోమీటర్లు వరుసగా మార్క్-1 మరియు మార్క్-2 పరిధి వరకు యుద్ద రాకెట్లను ప్రయోగించగలదు. అంతే కాదండోయ్ ఈ పినాకా కేవలం 44 సెకండ్ల కాలవ్యవధిలోనే దాదాపుగా 12 హెచ్‌ఇ రాకెట్లను ప్రయోగించగలదు.

Picture credit: Hemant.rawat1234/Wiki Commons

6. ఎమ్‌ఐ-35 హింద్ ఇ/ అక్బర్

6. ఎమ్‌ఐ-35 హింద్ ఇ/ అక్బర్

ఎమ్‌ఐ-35 హింద్ ఇ అనేది మల్టీ రోల్ లైన్ అట్టాక్ హెలికాప్టర్. ఇది అతి తక్కువ మంది సైన్యాన్ని యుద్ద క్షేత్రంలో తీసుకెళ్లి దాడులకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తుంది.

Picture credit: Alan Wilson/Wiki Commons

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఎమ్‌ఐ-హింద్ ఇ హెలికాప్టర్ యొక్క చరిత్రనే తిరగేస్తే ఇది ఎంతో శక్తివంతమైనదని తేలింది. గత నాలుగు దశాబ్దాల కాలంగా యుద్ద ప్రాంతాల్లో చక్కటి భూమిక వహించింది.

Picture credit: Alan Wilson/Wiki Commons

5. బ్రహ్మోస్

5. బ్రహ్మోస్

బ్రహ్మోస్ ఎంతో ప్రాణాంతకమైనది. ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మోస్ అంటే అత్యంత వేగవంతమైన మిస్సైల్ అని ఎంతో సుపరిచితం మరియు ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆధునికమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇది దీని పరిధుల వరకు ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది. దాదాపుగా మ్యాక్ 3 వేగానికి ఎంతో చేరువగా ఉంటుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణిని నేల మరియు నీటి మీద నుండి కూడా ప్రయోగించవచ్చు. ప్రస్తుతం జలాంతర్గామి నుండి ప్రయోగించే నూతన క్షిపణి ప్రయోగ దశలో ఉంది.

4. అగ్ని వి మిస్సైల్

4. అగ్ని వి మిస్సైల్

అగ్ని వి మిస్సైల్ అనునది అగ్ని మిస్సైల్ సిరీస్‌లో భాగం. వీటిని భారత దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వారు అభివృద్ది చేశారు. ఖండాలను చేధించే భారతదేశపు మొదటి మిస్సైల్‍‌గా పేరుగాంచింది.

 ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇది దీని పరిధుల వరకు ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది. దాదాపుగా మ్యాక్ 3 వేగానికి ఎంతో చేరువగా ఉంటుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణిని నేల మరియు నీటి మీద నుండి కూడా ప్రయోగించవచ్చు. ప్రస్తుతం జలాంతర్గామి నుండి ప్రయోగించే నూతన క్షిపణి ప్రయోగ దశలో ఉంది.

3. పిఎడి మరియు ఎఎడి బాలిస్టిక్ మిస్సైల్

3. పిఎడి మరియు ఎఎడి బాలిస్టిక్ మిస్సైల్

భారత్‌కు చెందిన ఈ బాలిస్టిక్ క్షిపణి మన దేశం మీదకు ప్రయోగించబడే శత్రు దేశాల క్షిపణులను నాశనం చేయగలదు. ఇందులో ప్రత్యేకంగా శత్రుమూకలు చీకటి వేళల్లో ప్రయోగించే క్షిపణులను గుర్తించి వాటి అక్కడే నాశనం చేసేవిధంగా ప్రోగ్రామింగ్ ఇవ్వడం జరిగింది.

Picture credit: Sniperz11/Wiki Commons

ఇండియన్ ఆర్మీ మరియు ఆయుధాలు

పృథ్వి ఎయిర్ డిఫెన్స్ యాంటి బాలిస్టిక్ క్షిపణి ని మన గగన తలం మీదకు దూసుకువచ్చే క్షిపణులను దాదాపుగా 300 నుండి 2000 కిలోమీటర్లు వేగంతో వస్తున్నప్పుడు ఇది మ్యాక్ 5.0 వేగం అనగా శబ్దం యొక్క వేగం కన్నా ఐదు రెట్ల వేగంతో వెళ్లి వాటిని నాశనం చేస్తుంది.

Picture credit: Ajai Shukla/Wiki Commons

2.సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ

2.సుఖోయ్ ఎస్‌యు-30ఎమ్‌కెఐ

ఎస్‌యు-30ఎమ్‌కెఐ లేదా ప్లాంకర్-హెచ్ పేరుతో పిలువబడే ట్విన్ జెట్ మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్. దీనిని రష్యా కు చెందిన సుఖోయ్ వారి పరిజ్ఞానంతో దేశీయంగా హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అభివృద్ది చేశారు.

ఇండియన్ ఆర్మీ మరియు ఆయుధాలు

దీనిని రెండు దేశాలకు చెందిన పరిజ్ఞానంతో తయారు చేసినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గల అత్యంత శక్తివంతమైన మరియు అడ్వాన్స్‌డ్ ఫైటర్‌ జెట్‌లలో ఇది ఒకటి . ఈ రష్యా మరియు భారత్‌ పరిజ్ఞానంతో పాటుగా ఫ్రెంచ్ మరియు ఇజ్రాయెల్ దేశాలకు చెందిన ఏవియానిక్స్ వ్యవస్థను వినియోగించుకున్నారు.

Picture credit: Chris Lofting/Wiki Commons

1. ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామి

1. ఐఎన్‌ఎస్ చక్ర జలాంతర్గామి

ఐఎన్‌ఎస్ చక్ర న్యూక్లియర్ జలాంతర్గామి దీనిని కూడా రష్యా సహకారంతో రూపొందించారు. ఈ సబ్ మెరైన్ కిల్లర్ మరియు హంటర్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం భారతదేశపు జాబితాలో ఉన్న జలాంతర్గామిలలో ఇది అత్యంత శక్తివంతమైనది. ప్రస్తుతం న్యూక్లియల్ శక్తి గల సబ్‌మెరైన్‌లను భారత్‌తో పాటు యుఎస్, రష్యా, యుకె, ఫ్రాన్స్ మరియు చైనా వంటి దేశాలు కలిగి ఉన్నాయి.

Picture credit: Indian Navy/Wiki Commons

ఇండియన్ ఆర్మీ మరియు ఆయుధాలు

ఈ ఐఎన్‌ఎస్ చక్రా న్యూక్లియర్ జలాంతర్గామి ఎక్కువ సమయం పాటు నీటి అడుగుబాగంలో ఉండగలదు. ఇది సముద్రంలోపల దాదాపుగా 600 మీటర్ల లోతున 30 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. సాధారణ సబ్‌మెరైన్ కన్నా ఇది రెట్టింపు వేగంతో సముద్రాన్ని చీల్చుకుంటూ పరుగులు పెడుతుంది. అయితే ముఖ్యంగా ఇది సముద్ర తలం మీదు తిరగాడే శత్రు దేశాలకు చెందిన షిప్పులను మరియు జలాంతర్గాముల పని పడుతుంది.

Picture credit: Ajai Shukla/Wiki Commons

మరిన్ని ఆసక్తికరమైన వివరాలకు
    • భారతీయుల గుండె ధైర్యం...! దేశీయ శౌర్య హైపర్‌సోనిక్ క్షిపణి
    • ISIS తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్
      • మరిన్ని ఆసక్తికరమైన వివరాలకు
        • మా బలం, మాకు గర్వకారణం..... ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!
        • ISIS తీవ్రవాదుల సమూల నాశనానికి ఫ్రాన్స్ పథకం

Most Read Articles

English summary
9 Extremely Powerful Weapons India Has In Case Of A War
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X