అంత ప్రమాదంలోనూ ప్రయాణికులను కాపాడిన కియా సెల్టోస్ 2023 భద్రతా ఫీచర్లు!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇటీవల తన సెల్టోస్ కారును అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసింది. కారు బయట, లోపల కీలక మార్పులు చేసింది. దీంతోపాటు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక భద్రతా ఫీచర్లను జతచేసింది. అయితే ఈ కియా సెల్టోస్ 2023 తాజాగా ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ప్రతీక్ సింగ్ తన యూట్యూ్బ్ ద్వారా షేర్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగింది. ప్రమాదంలో తెలుపు రంగులో ఉన్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు భారీగా డ్యామేజీ అయినట్లు వీడియోలో మనం గమనించవచ్చు.

వీడియో ఆధారంగా కియా సెల్టోస్ 2023 కారు జబల్‌పూర్‌లోని రోడ్డు మధ్యనున్న స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి సరైన కారణం తెలియలేదు. అయితే అధిక వేగం కారణం కావచ్చు లేదా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన వాహనం లేదా వ్యక్తిని తప్పించేందుకు చేసిన ప్రయత్నంలో కియా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు భారీగా డ్యామేజీ అయింది. హెడ్‌లైట్లు, ఫ్రంట్ బంపర్, గ్రిల్, రేడియేటర్ బాగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. కారు పిల్లర్లు, రూఫ్ ఎటువంటి డ్యామేజీ కాలేదు. విండ్‌షీల్డ్ కొంచెం దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. ఫలితంగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వీడియో ఆధారంగా ప్రమాదానికి గురైన వాహనం కియా సెల్టోస్ టాప్ స్పెసిఫికేషన్లు కలిగి GTX+ వేరియంట్‌గా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కియా సెల్టోస్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. గ్లోబల్ NCAP పరీక్షల్లో కేవలం 3 స్టార్ రేటింగ్‌ను సొంతం చేస్తుంది.
అనంతరం కియా కార్ల భద్రతపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లు అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. బిల్డ్ క్వాలిటి సహా భద్రతా ఫీచర్ల కారణంగా కియా కార్లు అత్యంత భద్రత కలిగిన వాహనాలుగా చలామణి అవుతున్నాయి.

కియా కొత్త సెల్టోస్ కారు ధర రూ.10.89 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ 2023 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 133bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 114bhp శక్తిని, 250Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ను బట్టి MT,iMT, AT, IVT, DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసెస్టెన్స్ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








