కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

వాహనాలను వినియోగించే అందరికి తెలుసు, వాహనంలో సేఫ్టీ ఎంత అవసరంలో. దాదాపు ప్రతి కారు ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కార్లలో భద్రత కోసం వివిధ రకాల అద్దాలను కూడా అందించి ఉండటం సాధారణంగా గమనించి ఉంటారు. ఇందులో భాగంగానే కారు లోపల రియర్‌వ్యూ మిర్రర్స్ మరియు ఇరువైపులా సైడ్ వ్యూ మిర్రర్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. అంతే కాకుండా కొన్ని సైడ్ వ్యూ మిర్రర్స్ లోపల మరో చిన్న అద్దాన్ని కూడా మీరు గమనించి ఉంటారు.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

సైడ్ వ్యూ మిర్రర్ లోపల ఉండే ఈ మిర్రర్‌లను బ్లైండ్‌స్పాట్ మిర్రర్స్ అంటారు. డ్రైవర్లు బ్లైండ్ స్పాట్ ప్రాంతంలో వచ్చే వాహనాలను రియర్ వ్యూ మిర్రర్స్ లేదా సైడ్ వ్యూ మిర్రర్స్ ద్వారా స్పష్టంగా చూడలేరు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. బ్లైండ్‌స్పాట్ అద్దాలు ఈ సమస్యను నివారించడంలో సహాయపడుతాయి.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

ఇదిలా ఉండగా కొన్ని పాత కార్లలో, రియర్ విండ్‌షీల్డ్‌పై మిర్రర్స్ ఉండటం గమనించవచ్చు. కానీ కొత్త కార్లలో ఈ అద్దాలు అందించబడవు. ఇప్పుడు విడుదల చేస్తున్న కార్లలో రియర్ వ్యూ మిర్రర్స్ చాలా ప్రధానం. ప్రతి కారులో ఇవి ప్రామాణికంగా అందించబడతాయి.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

ఇప్పుడు ఈ రియర్ వ్యూ మిర్రర్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ 1900 ప్రారంభం సమయంలో కార్లు రియర్‌వ్యూ మిర్రర్‌లను పొందలేదు. 1930లలో, కార్ల తయారీదారులు తమ కార్లలో రియర్ వ్యూ మిర్రర్స్ చేర్చారు. అయితే మనం ఈ కథనంలో ఆధునిక కార్లలో ఉండే రియర్ వ్యూ మిర్రర్స్ చరిత్రను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

మొదట మిర్రర్స్ అనేవి కార్లలో అమర్చడం వల్ల కార్లను వేగంగా నడపవచ్చు అని వాటిని ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగానే 1911 నాటికి రేసర్ రే హరోన్ అనే వ్యక్తి కార్లలో రియర్‌వ్యూ మిర్రర్‌ని అమర్చాలని ఆలోచించాడు. అతడు మొదటిసారి గుర్రపు బండిపై అమర్చిన రియర్‌ వ్యూ మిర్రర్ గమనించాడు. అప్పటి వరకు రియర్‌వ్యూ మిర్రర్‌ను డ్రైవర్లకు మాత్రమే అందించేవారు.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

రియర్ వ్యూ మిర్రర్స్ ప్రారంభం:

1921లో, ఎల్మెర్ బెర్గర్ మొదటిసారిగా రియర్ వ్యూ మిర్రర్‌పై పేటెంట్ పొందాడు. అతను ఈ పరికరానికి COP SPOTTER అని పేరు పెట్టాడు. తన కారును వెంబడిస్తున్న పోలీసులను చూడటానికి అతను రియర్ వ్యూ మిర్రర్ ఉపయోగించాడు. ఈ ప్రత్యేకమైన ఆలోచన ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రధాన సహకారాన్ని అందించింది, అంతే కాకుండా అది ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది. ఇప్పుడు విడుదలవుతున్న అన్ని కార్లలో రియర్ వ్యూ మిర్రర్ తప్పనిసరిగా ఉపయోగించబడుతుంది.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

ఆధునిక కాలంలో రియర్ వ్యూ మిర్రర్స్:

రియర్ వ్యూ మిర్రర్స్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా, ఈ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఇందులో భాగంగానే కార్ల వెనుక వీక్షణను స్పష్టంగా చూడటానికి అనేక రియర్ వ్యూ మిర్రర్స్ అందుబాటులోకి వచ్చాయి. రియర్ వ్యూ మిర్రర్స్ లేదా IRVMలు ఇప్పుడు వాటి స్వంత కెమెరాలు మరియు సెన్సార్‌లను ఉపయోగిస్తున్నాయి.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

కార్ల వెనుక పోలీసులను చూసేందుకు ఉపయోగించే అద్దం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. గతంలో విడుదల చేసిన పెద్ద SUVల వెనుక విండ్‌షీల్డ్‌పై అద్దాలను ఉంచారు. SUV లు సాధారణంగా పొడవుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కారు లోపలి భాగంలో ఉన్న రియర్ వ్యూ అద్దాలు కారు వెనుక భాగాన్ని అంత స్పష్టంగా చూపలేవు, కావున ఇందులో ఇలాంటి మిర్రర్స్ ఉపయోగించారు.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

కారు వెనుక భాగంలో ఏవైనా వస్తువులు ఉంటే, వాటిని రియర్‌వ్యూ అద్దాల ద్వారా చూడలేరు. ఇది కారును రివర్స్ చేసేటప్పుడు మరియు పార్కింగ్ చేసేటప్పుడు సమస్యలను కలిగిస్తుంది. కారు వెనుక వైపు చూసే అవకాశం లేకపోవడంతో కారు వస్తువులను ఢీకొనే అవకాశం ఉంది.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

పిల్లలు వాహనాల వెనుక ఆడుకుంటూ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అలాంటి సమస్యలను నివారించడానికి కార్ల వెనుక విండ్‌షీల్డ్‌పై వెనుక అద్దాలను ఉంచారు. ఈ అద్దాలు కార్ల టెయిల్‌గేట్ కింద ఉన్న మొత్తం ప్రాంతాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. దీని వల్ల కారు వెనుక ఏముందో డ్రైవర్ స్పష్టంగా చూడగలుగుతాడు.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

అంతే కాకుండా వాహనదారుడు కారు రివర్స్ మరియు పార్కింగ్ సమయంలో సురక్షితంగా నిర్వహించబడుతుంది. అందుకే పాత SUV లలో ఈ మిర్రర్స్ అందించబడతాయి. ఇప్పుడు విక్రయించబడుతున్న SUV లలో ఈ అద్దాలను ఎందుకు అందించడం లేదు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు విక్రయిస్తున్న కార్లు అధునాతనమైనవి. ఈ కార్లలో ప్రయాణీకుల భద్రత కోసం అనేక ఫీచర్లు అందించబడ్డాయి.

కార్లలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్స్.. చరిత్ర.. మీకు తెలుసా..!!

ఇప్పుడు విక్రయిస్తున్న చాలా SUV లలో రియర్‌వ్యూ కెమెరాలు అందించబడుతున్నాయి. ఈ రియర్‌వ్యూ కెమెరాలు వెనుక విండ్‌షీల్డ్ పైన ఉన్న అద్దాలను వాడుకలో లేకుండా చేస్తాయి. ఇప్పుడు విక్రయిస్తున్న కార్ల వెనుక భాగంలో కెమెరా అందించబడుతుంది. కాబట్టి కారు వెనుక భాగంలో ఏం జరుగుతుందో, అందులో ఏముందో ఈ కెమెరాల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాలన్నీ కారు క్యాబిన్‌లోని స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ కెమెరాల సహాయంతో రివర్స్ మరియు పార్కింగ్ చేయడం సులభం. రియర్‌వ్యూ కెమెరాల ఏర్పాటుకు కొత్త SUVల వెనుక విండ్‌షీల్డ్‌పై మిర్రర్స్ అమర్చాల్సిన అవసరం లేదు. ఈ అద్దాలు పాత SUVలకు ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి.

Most Read Articles

English summary
Facts behind installing rear view mirrors in cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X