మీకు ఇలాంటి చలాన్లు వస్తున్నాయా... అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రస్తుతం అన్ని రంగాల్లో టెక్నాలజీని అధికంగా వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైన అమర్చిన సీసీ కెమెరాలు సహా ఇతర పరికరాల ఆధారంగా వాహనాలకు ఈ-చలాన్‌లు విధిస్తున్నారు. అయితే అదే టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లకు ప్రజలను మోసం చేస్తున్నారు. నకిలీ చలాన్‌లు పంపి వాహనదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి వాటి ద్వారా నకిలీ చలాన్‌లు పంపి వాహనదారులను మోసం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇటువంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కీలక సూచనలు చేశారు.

అసలైన, నకిలీ చలాన్‌ల మధ్య తేడాను గుర్తించడం చాలా సులభమని తెలిపారు. అసలైన చలాన్‌లో వాహనం ఫోటో, పూర్తి వివరాలు, యజమాని పేరు, ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతం, సమయం ఉంటాయి. అదే నకిలీ చలాన్‌లో కేవలం నంబర్, చెల్లింపుల లింక్ మాత్రమే ఉంటుందని పోలీసులు తెలిపారు.
మీకు వచ్చిన చలాన్.. అసలైందా లేదా నకిలీదా తెలుసుకొనేందుకు పరివాహన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అసలైన చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకొనేందుకు ప్రయత్నం చేయండి. చలాన్ అసలైంది అయితే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కచ్చితంగా లభిస్తుంది. లేకుంటే నకిలీ చలాన్‌గా గుర్తించవచ్చు. దీంతోపాటు వచ్చిన చలాన్ లింక్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.

చెల్లింపుల లింక్ చివరన gov.inతో ముగిస్తే అది అసలైంది అని అర్థం. లేకుంటే నకిలీదని నిర్ధారణకు రావచ్చు. చలాన్‌లను ఈ రెండు పద్దతుల్లో తనిఖీలు చేశాకే.. చెల్లింపులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. తనిఖీ చేయకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లింపుల లింక్‌పై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇటువంటి నకిలీ చలాన్ మెసేజ్ రూపంలో వచ్చిన కొందరు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. సరైన వివరాలు లేకపోవడంతో వారు ఆందోళనతో పోలీసులను సంప్రదించినట్లు చెప్పారు. చలాన్‌కు సంబంధించిన మొత్తం సమాచారం పరివాహన వెబ్‌సైట్‌లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి తొలుత నిర్ధారణ చేసుకున్నాకే.. చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు.

హర్యానాలోని ఓ ప్రాంతంలో నలుగురు వాహనదారులను ఈ విధంగా మోసం చేసినట్లు సైబర్ క్రైం విభాగం గుర్తించిందని పోలీసులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం చంఢీగఢ్‌లో ఈ సంవత్సరంలో 7313 మంది వాహనదారులు, ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారని పోలీసులు తెలిపారు.
చంఢీగఢ్‌లో ఏప్రిల్ వరకు సుమారుగా 2196 సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో చాలా వరకు లైంగిక వేధింపులు, సోషల్ మీడియా మార్కెటింగ్ మోసాలు, డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు సహా ఇ- చలాన్‌లకు సంబంధించిన ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








