Subsidy on Electric Vehicles కేంద్రం సబ్సిడీ తగ్గింపు నిర్ణయంపై ఓలా అధికారి కీలక వ్యాఖ్యలు..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీపై కేంద్రం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈవీ వాహనాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా ఈ నిర్ణయం ద్వారా తమపై ఎలాంటి ప్రభావం పడదని ఓ అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2(fame 2) సబ్సిడీని తగ్గించడం ద్వారా భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఓలా కంపెనీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు. ఆయన ఎవరు.? దీనిపై ఆయన ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో త్వరగా ఆ స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఫేమ్-2 పేరుతో సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే మరియు విక్రయించే కంపెనీలకు నిర్దిష్ట మొత్తంలో సబ్సిడీ ఇవ్వబడుతుంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలను పెంచడానికి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ శాతాల్లో కంపెనీలకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.

ఇదిలా ఉండగా FAME - 2 ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి సదరు ఆటో కంపెనీలకు షాకిచ్చింది. ఈ నిర్ణయంతో జూన్ నుంచి ఎలక్ట్రిక్ 2-వీలర్ల ధరలు పెరగనున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాయి.
ఈ సమయంలో ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జీఆర్ అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సబ్సిడీ తగ్గింపు నిర్ణయం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. "భారత ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధికి FAME పథకం సహాయపడింది. ఈ పథకం సబ్సిడీ తగ్గింపు ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ అభివృద్ధిపై ఎటువంటి ప్రభావం చూపదు.' అని తెలిపారు.

FAME ప్రోగ్రామ్ ఇప్పటికే తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చిందని ఆయన అన్నారు. కానీ దీని తర్వాత సబ్సిడీ కొనసాగుతుందా? ఆగిపోతుందా? లేక సబ్సిడీ తగ్గుతుందా? అనేది ముఖ్యం కాదు. అయితే సబ్సిడీ తగ్గింపు కారణంగా వచ్చే జూన్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎంత పెరుగుతాయన్న వివరాలను ఓలా ఎలక్ట్రిక్ ఇంకా వెల్లడించలేదు.
కానీ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా జూన్ నుంచి ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచడం ఖాయం. ఓలా కాకుండా, ఏథర్ ఎనర్జీ తన 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను జూన్ నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ, విక్రయాలపై ఎలాంటి ప్రభావం పడనుందో వేచి చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








