మా బలం, మాకు గర్వకారణం.. ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!
మనం సాధారణంగా బయట ఉపయోగించే వాహనాలకు మరియు మిలిటరీలో ఉపయోగించే వాహనాలకు డిజైన్ మరియు టెక్నిల్ టెక్నికల్ పరంగా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీటి పరంగానే కాదు సైనిక వాహనాలు యొక్క సాంకేతికత మరియు బలంగా ఉంటాయి.
ప్రస్తుతం సమయంలో దేశం యొక్క భద్రత, శక్తి, దేశం యొక్క యాంత్రిక బలం, సైనిక వాహనాలు గురించి మనకు తెలుసు. ఇది మనకు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటాం. మన దేశానికి గర్వకారణమైన మిలిటరీ వాహనాల గురించి మనం తెలుసుకోవాలి.
భారతదేశపు మిలిటరీ వాహనాల గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు క్రింది స్లైడర్‌లో ఉన్నాయి.

1.అశోక్ లేలాండ్ సాయుధ వాహనము :
అశోక్ లేలాండ్ సాయుధ వాహనం యొక్క నిర్మాణం ఎంతో ధృఢంగా ఉంటుంది. అందువలన యుద్దంలో ఇది ఎలాంటి విస్పోటనాలకు కూడా చెడిపోదు. ఈ సాయుధ వాహనంలో డ్రైవర్ మరియు సహ-డ్రైవర్‌తో కలిపి మొత్తం 10 మంది సైనికులు ఇందులో ప్రయాణించవచ్చు.
Also Read: కొత్త కన్వర్టబుల్ మిని కూపర్ కారును ఆవిష్కరించారు.మరి ఇది భారత్‌కు వస్తుందా?: మరింత చదవండి

2.ఇంజన్ :
ఈ సాయుధ వాహనం ఆరు సిలిండర్లు గల టర్బో డీజల్ ఇంజన్ కలిగి ఉండి రెండు రకాల పవర్‌ను విడుదల చేసే రెండు ఇంజన్ వేరియంట్లలో లభించును. అందులో ఒక మోడల్ 230బిహెచ్‌పి మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగా మరొక మోడల్ 360బిహెచ్‌పి మరియు 1400 టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ కలదు మరియు ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ రెండు రకాల ఆప్షన్‌లలో లభించును.

3. ముఖ్యాంశాలు :
- ఈ సాయుధ వాహనం యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 350 ఎమ్ఎమ్‌గాఉంది.
- దీని తల భాగాన రెండు పెద్ద తుపాకులను అమర్చారు ఇది యుద్ధంలో శత్రు సైన్యం మీద దాడి చేయగలదు.
- ఈ రెండు మోడల్స్ 4-వీల్ మరియు 6-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ని అందిస్తున్నాయి.
- దీనికి ఉన్న అత్భుతమైన టైర్లు ఎటువంటి రోడ్ల మీదైనా చక్కటి పని తీరును కనబరుస్తాయి.
- పవర్ స్టీరింగ్.
- ఎయిర్ కండీషన్ అనుకూలత .
- సమతల టైర్లు.
- యుద్దంలో శత్రు సాయుధ వాహనాలను ధ్వసం చేయగలదు.
- దీని టాపు పైన పెద్ద పెద్ద తుపాకులను అమర్చారు.
- భారతదేశం కోసం పోరాడే 7 హెలికాప్టర్లు
- భారత్‌లో ల్యాండింగ్ కానున్న ప్రపంచంలో కెల్లా తొలి సోలార్ ప్లేన్: మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- విమానమా లేక ఇంధ్ర భవనమా...

4. భారత దేశపు హమ్మర్ :
మనందరికి బాగా తెలిసిన యుద్ద వాహనం ఏదంటే హమ్మర్ అని బాగా తెలుసు. సాధారణ సమయాల్లో సాయుధ దళాల ప్రయాణించడానికి మరియు యుద్ధ సమయాల్లో ప్రయాణానికి ఇవి ఉపయోగబడే విధంగా తయారు చేయబడ్డాయి.

5.హమ్మర్ ఇంజన్ :
సాయుధ ధళానికి చెందిని ఈ యుటిలిటి వాహనం మెర్సిడెస్-బెంజ్‌కు చెందినది ఇందులో ఐదు సిలిండర్లు గల 2.7-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది 172బిహెచ్‌పి, 340 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ గల 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంది.

6. ప్రత్యేక లక్షణాలు :
భూమి నుండి 350 ఎమ్ఎమ్ ఎత్తులో ఈ సాయుధ వాహనాన్ని చక్రాల మీద అమర్చారు. అంటే ఎటువంటి ఎగుడు దిగుడు ప్రాంతాల్లో అయినా సునాయాసంగా పరుగులు పెడుతుందన్నమాట. దీని ఇంధన సామర్థ్యం 65 లీటర్లు. మరియు ఎక్కువ గ్రిప్ గల టైర్లను ఉపయోగించారు.

7.టాటా సాయుధ వాహనము :
దీనిని ఎక్కువగా నక్సలైట్ల ఆధిపత్య ప్రాంతాల్లో, బోర్డర్ నిఘా, భద్రత సేవల కోసం ఉపయోగిస్తారు. శత్రువులు పెరగకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పారామిలటరి సైనికుల్ని చేరవేయడానికి ఉపయోగిస్తారు. ఒక్క వాహనంలో దాదాపుగా 14 మంది సైన్యం ప్రయాణించవచ్చు.

8. ఇంజన్ :
ఈ సాయుధ వాహనంలో 240 బిహెచ్‌పి, 925 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే అత్యంత శక్తివంతమైన డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ పవర్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా 4-వీల్ డ్రైవ్ గల చక్రాలకు చేరుతుంది.

9. స్పెసిఫికేషన్స్ :

10.మహీంద్రా మార్క్స్‌మెన్ :
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. పట్టణ ప్రాంతాల్లో తీవ్రవాద దాడులను తిప్పికొడ్డడంలో ఇది ఎంతో సమర్థవంతమైనది. ఇందులో డ్రైవర్ సహా మొత్తం ఆరు మంది సైనికులు ప్రయాణించవచ్చు.

11.ఇంజన్ :
ఈ రకమైన సాయుద వాహనంలో చిన్న టర్బో ఇంజన్ ఉంటుంది. 2.49-లీటర్ డీజల్ ఇంజన్ ఇందులో కలదు. సైనికులు శత్రు స్థావరాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇందులో ఉన్న 4-వీల్ డ్రైవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

12. ప్రత్యేకత :
దీనిని మొదటి సారిగా 2011 ముంబయ్ ఉగ్రవాద పేలుళ్ల సమయంలో కొనుగోలు చేశారు. ఇందులో ఒకే సారి ఏడు తుపాకులతో కాల్పులు జరపవచ్చు. కొత్త తరం తుపాకులైన ఎకె-47 మరియు ఎకె-56 సోల్ ప్యాసింజర్ వంటి ఆయుధాలను అమర్చారు.

13.అశోక్ లేలాండ్ సూపర్ స్టాలిన్ 8*8 :
ప్రస్తుతం మన దేశంలో ఉన్నఆర్మి సైనికులు రవాణా కోసం పెద్ద సంఖ్యలో సాయుద వాహనాలను ఉపయోగించుకుంటోంది. అందులో ఈ అశోక్ లేలాండ్ సూబపర్ స్టాలిన్ వాహనాలనే దాదాపుగా 65,000 ఉన్నాయి.

14.ఇంజన్ :
ఈ అశోక్ లేలాండ్ సూపర్ స్టాలిన్ యొక్క ట్రక్కు ఇంజన్ 360బిపెచ్‌పి, 14,00 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు ఇందులో 8-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఎగుడు దిగుడు రోడ్ల మీదైనా సునాయాసంగా వెళ్ళగలదు.

15.ప్రత్యేకతలు :
ఈ లేలాండ్ సాయుధ వాహనము ద్వారా ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండే లఢఖ్ రహదారుల్లో మరియు రాజస్థాన్ ఎడారుల్లో ఎటువంటి ప్రాంతాల్లో అయిన యుద్ధం చేయాల్సి వచ్చినపుడు. శత్రువుల మీదకు సులభంగా వెళ్లి పోరాడగలవు.

16.టాటా సాయుధ వాహనము :
టాటాకు చెందిన సాయుద వాహనాల తయారి విభాగము వీటిని టాటా మోటార్స్ చిన్న సాయుధ కార్లు అని సంభోదిస్తారు. భవిష్యత్తులో సైనిక దళాలు వీటని సరిహద్దు ప్రాంతాల్లో ఉపయోగించనున్నారు. ఇవి కొన్ని కొత్త ఫీచర్లతో రానున్నాయి.

17.ఇంజన్ :
ఇందులో 3.0-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇందులో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ వాహనంలో ఉన్న 4-వీల్ డ్రైవ్ చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. ఎలాంటి రహదారుల్లో అయినా ఇది చక్కగా కదులుతుంది.

18. ప్రాముఖ్యత :
ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయిన వాహనాన్ని సైనిక అంబులెన్స్‌గా బదిలీ చేసుకునే లక్షణాలు ఇందులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications








