అసలు సిసలైన సెలబ్రేషన్.. కొత్త కారు డెలివరీ తీసుకునేందుకు ఫ్యామీలీ అంతా ఒకే డ్రెస్ కోడ్.!!
కొత్త కారును డెలివరీ చేసే సమయంలో డీలర్‌షిప్ సిబ్బంది కేక్ కేయించడం ఆనవాయితీ. ఆ సందర్భాన్ని కస్టమర్లు చాలా సంతోషంగా జరుపుకొంటూ వాటిని తమ ఫోన్లలో తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటారు. కాగా ఇక్కడ ఓ ఫ్యామిలీ మాత్రం తమ కలల కారును సొంతం చేసుకున్నందుకు.. ఆ కారును డెలివరీ తీసుకునే సందర్భాన్ని అందరి కంటే విభిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
భారత్‌లో కొత్త కారు కొనుగోలు చేయడం అనేది చాలా మందికి కల. తమ బడ్జెట్ ధరలో మంచి కారును కొనుగోలు చేసేందుకు తమ సంపాదనలో కొత్త మొత్తాన్ని అందుకోసమే సేవింగ్స్ చేస్తారు. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కారు నిత్యావసరంగా మారిపోయింది. ఫ్యామిలీ అవసరాలు, ఆఫీసు పనుల కోసం ఎక్కువగా కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొత్త కారు కొనుగోలు చేశాక చాలా మంది వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉంటున్నాం. కొందరు ఫ్యామిలీతో, మరికొందరు ఫ్రెండ్స్‌తో ఉత్సాహంగా గడుపుతారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్‌తో కొత్త కారులో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తుంటారు. అయితే కారు డెలివరీ తీసుకునే సమయంలో డీలర్‌షిప్‌లు కూడా సెలబ్రేషన్స్ జరుపుతాయి.
కాగా కేరళకు చెందిన ఓ ఫ్యామిలీ ఈ సంతోషకరమైన సందర్భాన్ని మరికొంత వినూత్నంగా జరుపుకొంది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కొత్త వోక్స్ వ్యాగన్ వర్టస్(VolksWagen Virtus)ను కొనుగోలు చేశారు. డెలివరీ తీసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి షోరూమ్‌కు వెళ్లారు. బ్లూ కలర్ వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను కొనుగోలు చేయడంతో ఫ్యామిలీ మొత్తం బ్లూ కలర్ కాస్ట్యూమ్ ధరించారు.

ఫ్యామిలీ మొత్తం బ్లూ కలర్ డ్రెస్ కోడ్‌లో షోరూమ్‌కు వెళ్లి కొత్త వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను డెలివరీ తీసుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు.. నీలం రంగు దుస్తులు ధరించి బ్లూ షేడ్‌లోని వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను డెలివరీ తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. కాగా ఆ ఫ్యామిలీ కొనుగోలు చేసిన వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను.. లావా బ్లూ షేడ్‌లో ఫినిషింగ్ చేశారు. ఇది కారుకు ప్రీమియం లుక్‌ను జోడించింది. వోక్స్‌వ్యాగన్ సెడాన్‌ను లావా బ్లూ షేడ్‌తో పాటు రైజింగ్ బ్లూ షేడ్‌లోనూ అందిస్తుంది. లావా బ్లూ షేడ్‌లో గ్రీన్ కలర్ మిక్స్ అయి కనిపించడంతో ఇది ఇంకా రాయల్ లుక్‌ను కలిగి ఉందని చెప్పవచ్చు.

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రముఖ సెడాన్‌లలో వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఒకటి. దీనిని MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను రూపొందించారు. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రీమియం మిడ్ లెవెల్ సెడాన్.
వోక్స్ వ్యాగన్ వర్టస్ ఈ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, స్కోడా స్లావియా వంటి కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఇందులో అధునాత ఫీచర్లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, ఇంకా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

వోక్స్ వ్యాగన్ వర్టస్ ఇంజిన్ పనితీరును పరిశీలిస్తే.. ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 115 PS, 178 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
కాగా వోక్స్ వ్యాగన్ వర్టస్ మరో ఇంజిన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.. 150 PS, 250 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయగా.. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఈ ఇంజిన్ ఆప్షన్‌తో ఉన్న కారును GT వేరియంట్ అని కూడా అంటారు. అయితే కేరళకు చెందిన ఈ ఫ్యామిలీ ఏ వేరియంట్ కారు కొనుగోలు చేసిందో స్పష్టంగా తెలియదు. కాగా భారత మార్కెట్లో Volkswagen Virtus ధర రూ. 11.48 లక్షల బేస్ ధరతో అందుబాటులో ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.29 లక్షల వరకు ఉంది.


Click it and Unblock the Notifications








